మహారాష్ట్రలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుకు మూలకారణంగా ఉన్నారు. ఆయన సూరత్ నుంచి గౌహతి చేరుకున్నారు. తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏక్నాథ్ షిండే చెబుతున్నారు. పార్టీకి విధేయులని భావించి మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం పెద్ద పెనుగాలి వీచింది. శివసేనపై తిరుగుబాటు చేసిన తర్వాత, ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హోటల్లో ఉన్నారు. బుధవారం ఉదయం షిండేతో పాటు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి గౌహతికి చేరుకున్నారు.
బాల్‌థాక్రే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తామని ఏక్నాథ్ షిండే తెలిపారు. మహరాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. బాల్ థాకరే అనుసరించిన హిందుత్వ విధానాలకు తామే అసలు వారసులమని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. హిందుత్వవాదంతో కూడిన శివసేనను వీడలేదని.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం గురించి ప్రస్తుతం తాము ఏం మాట్లాడబోమని అన్నారు. నా వెంట మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో 34 మంది శివసేన, 7 మంది స్వతంత్రులు ఉన్నారని స్పష్టం చేశారు. మద్దతుదారులతో కలిసి ఏక్నాథ్ షిండే ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్‌తో షిండే భేటీ కానున్నారు. తనతో 2/3 పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, దీంతో శివసేన పార్టీ తనదేనని ఆయన క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంది. బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు షిండే లేఖ ఇవ్వనున్నారు. బుధవారం ఏక్నాథ్ షిండే బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.