మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిండే.. అంటూ సంచలన ప్రకటన..!

0
893

మ‌హారాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఎన్నిక‌య్యారు. బీజేపీ కీల‌క నేత‌, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో విప‌క్ష నేత‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ గురువారం సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో శిబిరం నిర్వ‌హించిన షిండే గురువారం మ‌ధ్యాహ్నం ముంబై చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫ‌డ్న‌వీస్ ఇంటికి వెళ్లిన షిండే… ఫ‌డ్న‌వీస్‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే బ‌లం త‌మ‌కు ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు తెలిపారు. గ‌వ‌ర్నర్ నుంచి ఆమోదం తీసుకున్న త‌ర్వాత షిండేతో క‌లిసి ఫ‌డ్న‌వీస్ మీడియాతో మాట్లాడారు. షిండే నేతృత్వంలో శివ‌సేన ప్ర‌భుత్వం ఏర్పడుతుందని ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ చేశారు. తాము షిండే ప్ర‌భుత్వానికి బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, ప్ర‌భుత్వంలో చేర‌బోమ‌ని ప్ర‌క‌టించారు. షిండే ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టే బాధ్య‌త త‌మ‌దేన‌ని చెప్పుకొచ్చారు.