కరోనా మహమ్మారి కారణంగా లక్షల్లో కేసులు ప్రతి రోజూ నమోదవుతూ ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ తో పాటూ కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. అయితే రంజాన్ షాపింగ్ సమయాల్లో మాత్రం ఎటువంటి ఆంక్షలు అమలు చేస్తూ కనిపించడం లేదు. చాలా నగరాల్లో కరోనా ఆంక్షలను తుంగలో తొక్కి మరీ షాపింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలపై ఎంతో మంది వీడియోలను పోస్టు చేస్తూ ఉన్నా కూడా పోలీసులు, అధికారులు కనీసం చర్యలు తీసుకోలేదు.
తెలంగాణ:
తెలంగాణలో 10 రోజుల పాటూ లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే ఓల్డ్ సిటీలో మాత్రం ఈ ఆంక్షలు కనిపించడం లేదు. చార్మినార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున షాపింగ్ కోసం ఎగబడ్డారు. చార్మినార్ దగ్గర నుండి మదీనా వరకూ పెద్ద ఎత్తున ప్రజలు షాపింగ్ కోసం ఎగబడ్డారు. మాస్కులు కనిపించలేదు.. సోషల్ డిస్టెన్సింగ్ అన్నది పాటించలేదు.

మహారాష్ట్ర:
మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కు మహారాష్ట్రలో నమోదైన కరోనా కేసులే కారణమని చెప్పే వారు కూడా ఉన్నారు. ఇక ముంబైలో కూడా ఈద్ షాపింగ్ కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆడవాళ్లు, మగవాళ్ళు, పిల్లలు కలిసి మాస్కులు వేసుకోకుండా భేన్డి బజార్, సౌత్ ముంబై ప్రాంతాల్లో పెద్ద ఎత్తున షాపింగ్ చేశారు. ఏ ఒక్కరు కూడా కరోనా మార్గదర్శకాలను పాటించలేదు.
ఒకానొక సమయంలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గుతూ ఉన్నట్లు కనిపించినప్పటికీ.. మంగళవారం నాడు మరోసారి కరోనా కేసులు పెరిగిపోయాయి. మంగళవారం నాడు 793 కరోనా మరణాలు నమోదయ్యాయి.
జమ్మూ కాశ్మీర్:
ఈద్ షాపింగ్ కోసం శ్రీనగర్ లో పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీనగర్ లో ప్రస్తుతం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉన్నా కూడా వీటిని పట్టించుకోకుండా షాపింగ్ కోసం ఎగబడ్డారు. శ్రీనగర్ లోయలో ఈద్ సందర్భంగా పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా మొహరించారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకూ మాత్రమే ప్రజలు షాపింగ్ చేసుకోడానికి వెసులుబాటును ఇస్తూ శ్రీనగర్ డిప్యూటీ కమీషనర్ ఐజాజ్ అసద్ ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్:
ఉత్తరప్రదేశ్ లోని చాలా నగరాల్లో కోవిడ్-19 ఆంక్షలను పాటించలేదు. మార్కెట్లలో పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు. సామాజిక దూరం అన్నది పాటించకుండా.. మాస్కులు కూడా కొందరు వేసుకోకుండా కనిపించారు. ఫిరోజాబాద్ లోని మార్కెట్లలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ ను అసలు పట్టించుకోలేదు. అలీఘర్ లోని మార్కెట్లు కూడా జనంతో నిండిపోయాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ స్టాఫ్ 40 మంది చనిపోయాక కూడా ప్రజలు కనీసం సామాజిక దూరం వంటి నియమాలని పాటించలేదు.

పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మతపరమైన కార్యక్రమాలకు అనుమతిని ఇచ్చారు. 50 మందిని మించకుండా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించవచ్చని మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్తగా ఆదేశాలను జారీ చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు కూడా భారీగా నమోదవుతూ ఉన్నాయి.