More

    స్మగ్లింగ్ కోసం సొరంగంలోకి దూరారు.. సైన్యం విష వాయువును పంపడంతో..!

    స్మగ్లింగ్ కోసం దుండగులు కొన్ని ప్రాంతాల్లో సొరంగాలను వినియోగిస్తూ ఉన్నారు. ఈజిప్టు-గాజా మధ్యలో కూడా అలాంటి ఓ సొరంగం ఉంది. ఈజిప్టు సైన్యం ఈ స్మగ్లింగ్ సొరంగంలోకి విష వాయువును పంపింగ్ చేయడంతో ముగ్గురు పాలస్తీనియన్లు గురువారం మరణించినట్లు పాలస్తీనా మీడియా నివేదించింది. ఈ సొరంగం గాజా స్ట్రిప్ నుండి సినాయ్ ద్వీపకల్పం వరకు విస్తరించి ఉంది. 2019 లో కూడా ఈ స్మగ్లింగ్ సొరంగంలోకి ఈజిప్టు దళాలు విషపూరిత పొగలను పంప్ చేయడంతో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 2017 లో గాజా మరియు సినాయ్ మధ్య ఉన్న సొరంగంలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు.

    ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మీడియా నివేదికల ప్రకారం ఈజిప్టు సైన్యం టన్నెల్‌లోకి విషపూరిత వాయువును పంపడంతో గాజా మరియు ఈజిప్ట్ మధ్య స్మగ్లింగ్ టన్నెల్ లోపల కనీసం ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారని తెలుస్తోంది. ఈజిప్ట్-గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఫిలడెల్ఫీ కారిడార్ కింద ఉన్న సొరంగాలను పాలస్తీనియన్లు వివిధ వస్తువులను గాజా స్ట్రిప్‌లోకి అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈజిప్ట్ మరియు గాజా మధ్య రఫా సరిహద్దు దాటడానికి, పాలస్తీనియన్లు హమాస్ పాలిత గాజా స్ట్రిప్‌లోకి ఆహారం, ఇంధనం, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని రవాణా చేయడానికి సొరంగాలను ఉపయోగిస్తూ వస్తున్నారు.

    ఈజిప్టు సైన్యం టార్గెట్ చేసిన ఈ సొరంగం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం నుండి గాజా స్ట్రిప్ వరకు విస్తరించి ఉంది. సొరంగంలో పనిచేసే కార్మికులు చనిపోయారని గాజా వర్గాలు అంటున్నాయి. సొరంగంలో కార్మికులతో సంబంధాలు తెగిపోయాయని గాజాలోని వర్గాలు తెలిపాయి. అక్రమ రవాణా సొరంగాలపై ఈజిప్ట్ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. 2010, 2009 లలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. స్మగ్లింగ్ టన్నెల్‌లను ఆపడానికి గాజాకు 4 కి.మీ సరిహద్దులో స్టీల్ బారియర్‌ను నిర్మించడం మొదలుపెట్టింది ఈజిప్టు. “హమాస్ మెట్రో” అని పిలువబడే గాజా స్ట్రిప్ సరిహద్దులలో విస్తృతమైన సొరంగాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.

    Trending Stories

    Related Stories