More

    ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు

    ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో కవితను ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారాడు. ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులు రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరాలు అప్రూవర్‌గా మారారు. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారింది.

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే కవిత ఓసారి ఈడీ విచారణకు వెళ్లి వచ్చారు. రెండు రోజులు హాజరయ్యారు. 2023, మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజులు కవితను రోజంతా విచారించారు. అప్పట్లో ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవిత, రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ విచారణకు పిలవటం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత ఈడీ చెప్పిన సమయానికి హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అప్పట్లోనే కవిత అరెస్ట్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఏమి జరుగుతుందో అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది.

    Related Stories