National

మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీలకు షాక్ ఇచ్చిన ఈడీ

బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురికి సంబంధించిన రూ. 18,170.02 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి. బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ ఆస్తుల విలువ దాదాపుగా 80.45% ఉంటుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రూ. 9,371 కోట్ల విలువైన ఆస్తులను రుణాలు ఇచ్చిన బ్యాంకులకు బదిలీ చేశారు. ముంబైలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆస్తులను బదిలీ చేశారు. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి బ్యాంకులను మోసం చేసిన మొత్తం 22 వేల 586 కోట్ల రూపాయలలో 40 శాతాన్ని ఇప్పటి వరకు రికవరీ చేశారు.

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా లకు సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకొంది. బ్యాంకులు ఎదుర్కొంటున్న మొత్తం నష్టాల్లో 80 శాతం పైగా రూ. 18,750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ. 9,371.17 కోట్ల విలువైన వాటాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్టుగా ఈడీ బుధవారం నాడు తెలిపింది. ఈ ముగ్గురి నుంచి సీజ్ చేసిన 8 వేల 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బదిలీ చేయగా ఇప్పటి వరకు మొత్తం 9371 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బ్యాంకులకు ఇచ్చింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు మోసం చేసిన మొత్తం రూ. 22,585.83 కోట్లు కాగా.. వీటిలో రూ. 18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ఇప్పటికే రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 15 =

Back to top button