Telugu States

తాడిపత్రిలో జేసీ నివాసంపై ఈడీ దాడులు

తాడిపత్రిలో జేసీ నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నారు. జేసీ ట్రావెల్స్ స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్‌తో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జేసీ ముఖ్య అనుచరుడు చవ్వాగోపాల్ రెడ్డి ఇంటి పైనా దాడులు కొనసాగుతున్నాయి. వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

పలు ప్రాంతాల్లో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తోంది. జేసీ ఇంటిపై ఈడీ రైడ్స్ నేపథ్యంలో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు హైదరాబాద్ లో జేసీ బ్రదర్స్ కు చెందిన ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.

Related Articles

Back to top button