National

రాహుల్ సమాధానంతో ఈడీ సంతృప్తిగా లేదా..?

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. ఉదయం 11.10 గంటల నుంచి రాత్రి 11.10 వరకు సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. అయితే రాహుల్ చెప్పిన సమాధానాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం.

విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ సంస్ధలో షేర్లు ఎందుకున్నాయని ప్రశ్నించారట. అలాగే నేషనల్ హెరాల్డ్‌లో కాంగ్రెస్ పార్టీ పాత్రకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు రాహుల్ సరిగ్గా సమాధానం చెప్పలేదని, దీనిపై ఈడీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ప్రతి ప్రశ్నకు రాహుల్ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారని, కొన్ని ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో, వాటిని ఎలా తప్పించాలో తన లాయర్ ద్వారా రాహుల్ బాగా ప్రిపేర్ అయ్యారని ఈడీకి చెందిన ఒక అధికారి అన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

10 − 2 =

Back to top button