ఈడీ చేతిలో రానా అయూబ్ ‘ఫిక్స్‎డ్’..! పేదల పేరుతో డబ్బు దండుకున్న సోకాల్డ్ జర్నలిస్ట్..!!

0
783

రానా అయూబ్‎పై తాజాగా ఈడీ ‘ప్రాసిక్యూషన్ కంప్లెయింట్’ దాఖలు చేసింది. విపత్తుల పేరుతో ఈ సోకాల్డ్ జర్నలిస్టు సేకరించిన విరాళాలను.. సొంతానికి వాడుకున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ బాధితుల కోసమని ఓసారి.. మురికివాడల్లో ప్రజల కోసమని మరోసారి.. నిరుపేదల పేరుచెప్పుకుని భారీ ఎత్తున నిధులు సేకరించింది. అయితే ఈ నిధులను ఫిక్స్‎డ్ డిపాజిట్లు చేసుకుని డబ్బులు దండుకునే ప్రయత్నం చేసింది. దీంతో రానా అయూబ్‎పై ఈడీ దృష్టి సారించింది. రానా అయూబ్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేయడం కోసం ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ దాఖలు చేసింది.

రానా అయూబ్.. ఈ పేరు వింటేనే.. జర్నలిజానికి మాయని మచ్చ అని పాతకాలపు జర్నలిస్టులు అభిప్రాయపడుతుంటారు. జర్నలిస్టు అని చెప్పుకోవడమే కానీ,.. ఏ కోశానా జర్నలిజం విలువలను పాటించదనే ఘనమైన పేరుందీవిడకు. ట్విట్టర్ మల్లయోధురాలైన రానా అయూబ్ చేసే ప్రతి ట్వీట్ కూడా వివాదాస్పదమే. ప్రజల్లో ద్వేషాన్ని నింపడమే తన జీవిత పరమావధిగా భావిస్తుంటుంది. స్వతహాగా ఇస్లాం మతానికి చెందిన రానా అయూబ్.. తన సొంత మతం వారిని కూడా చెడుదారి పట్టిస్తుంది. అంతేకాదు, విదేశీ పత్రికల్లో భారత్‎కు వ్యతిరేకంగా కాలమ్‎లు రాయడం నుంచి, విదేశీ సభల్లో భారత్‎పై విషం చిమ్మే వరకు.. రానా అయూబ్ చేయని పనంటూ లేదు. గతంలో ఈవిడ రాసిన పుస్తకం కూడా వివాదాస్పదమైంది. ఎవరైనా పుస్తకం రాస్తే దాంట్లో కాస్తో కూస్తో నిజం ఉంటుంది. అందునా జర్నలిస్టు ఒక పుస్తకం రాస్తే కొద్దోగొప్పో నిజమని నమ్ముతారు. కానీ, 2002 గుజరాత్ మారణకాండపై రానా అయూబ్ రాసిన పుస్తకాన్ని ఏకంగా సుప్రీం కోర్టే తప్పుబట్టింది. ఈ పుస్తకంలో ఏమాత్రం నిజం లేదనీ,.. ఇదంతా పూర్తి ఊహాగానాలతో, ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా రాసిన పుస్తకమనీ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

కొన్నిసార్లు రానా అయూబ్ చేసే ట్వీట్లను ఇస్లాం దేశాలు కూడా వ్యతిరేకిస్తాయి. గతంలో సౌదీ నుండి రానా అయూబ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. సౌదీకి యెమెన్ తీవ్రవాదులకు చాలా ఏళ్ళుగా యుద్ద వాతావరణం నెలకొంది. తరచూ ఇరువురి మధ్య రాకెట్ లాంచర్లతో దాడులు జరుగుతుంటాయి. హౌతీ తీవ్రవాదులు తరచూ సౌదీపై రాకెట్ లాంచర్లతో బాంబుల వర్షం కురిపిస్తుంటారు. దీంతో.. హౌతీ తీవ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు రాకెట్లను ఉపయోగించింది. అయితే దీన్ని రానా అయూబ్ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచంలో ముస్లింలందరికీ పెద్దలమని చెప్పుకునే సౌదీ.. ముస్లిం బ్రదర్‎హుడ్‎ను మరచిపోయిందని వ్యాఖ్యానించింది. యెమెన్ ఇస్లాంలో విలువలను మరచి అక్కడ రక్తపాతానికి సౌదీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. దీంతో సౌదీ ప్రభుత్వం రానా అయూబ్ పై ఎదురుదాడి చేసింది. తాము ముస్లింలకు వ్యతిరేకంగా కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని స్పష్టం చేసింది. ఈ మిలటరీ ఆపరేషన్స్‎ను పది దేశాలతో కలిపి యెమెన్ దేశ ప్రభుత్వ సహకారంతో హౌతీ తీవ్రవాదులపై పోరాడుతున్నామని స్పష్టం చేసింది. తాము విలువల ప్రకారం పోరాడుతుంటే రానా అయూబ్ మాత్రం ఉగ్రవాదులకు మద్దతిస్తోందని గట్టిగా సమాధానం ఇచ్చింది. ఈ పరిణామాలతో రానా అయూబ్ ద్వంద వైఖరి ప్రపంచదేశాలకు తెలిసిపోయింది.

దీంతో పాటు గతంలో కర్ణాటక హిజాబ్ వివాదం మొదలైనప్పుడు కూడా ముస్లిం విద్యార్థులకు మద్దతుగా నిలబడింది. హిజాబ్ వేసుకునే ముస్లింలను విద్యాసంస్థల్లో అనుమతించాలని భారత్‎లో హిజాబ్ నిరసనలకు మద్దతిచ్చింది. అయితే ఇదే రానా అయూబ్ ఇరాన్‎లో జరుగుతున్న హిజాబ్ ఉద్యమానికి మాత్రం భిన్నంగా స్పందించింది. బురఖా ధరించడం, ధరించకపోవడంపై ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయం అని ట్వీట్ చేసింది. దీంతో ట్విట్టర్‎లో మరోసారి ముస్లింల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది. భారత్‎లో హిజాబ్‎ను సమర్థించిన రానా అయూబ్.. ఇరాన్‎లో మాత్రం హిజాబ్‎ను వ్యతిరేకించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే భారత్‎లో ఇంతగా హిజాబ్‎ గురించి గొంతు చించుకునే రానా అయూబ్.. తన జీవితంలో చాలా వరకు హిజాబ్ లేకుండానే జీవిస్తోంది.

ఈ విధంగా తరచూ ద్వంద ప్రమాణాలతో తన సొంత ఫాలోవర్స్ నుండే వ్యతిరేకత ఎదుర్కొనే రానా అయూబ్ జర్నలిస్టు పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేసింది. 2020లో కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించింది. క్రౌడ్ ఫండింగ్‎లో బాగా ప్రాచుర్యం పొందిన ‘కెట్టో’ అనే వెబ్ సైట్ లో తాను తన టీమ్ తో కలిసి కోవిడ్ బాధితులకు సేవచేస్తున్నాం,.. దీని కోసం విరాళాలు ఇవ్వండంటూ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్‎లో తన ఫాలోవర్స్ నుండి రానా అయూబ్‎కు భారీగానే విరాళాలు సమకూరాయి. దీంతో మళ్ళీ కోవిడ్ పేరుతోనే ‘రిలీఫ్ వర్క్ ఫర్ అస్సాం, బీహార్ అండ్ మహారాష్ట్ర’ అనే పేరుతో మరోసారి క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. అంతేకాదు, మురికివాడల్లో నివసించేవారికోసం, రైతుల కోసమంటూ మరోసారి తన ఫాలోవర్స్ నుంచి విరాళాలు దండుకుంది. ఇలా మొత్తం మూడు క్యాంపెయిన్‎లలో రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలను విరాళాలుగా సేకరించింది సోకాల్డ్ జర్నలిస్టు.

అయితే ఈ విధంగా సేకరించిన నిధులను ఏ ఒక్క కోవిడ్ పేషెంటుకూ, రైతులకూ ఉపయోగించకుండా తన సొంతానికి వాడుకుంది. తనకు వచ్చిన రెండున్నర కోట్లలో కేవలం పదిశాతం మాత్రమే సహాయార్థం వినియోగించి మిగిలిన డబ్బునంతా తన పేరిట ఉన్న ఖాతాల్లో బదిలీ చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 50 లక్షలు రానా అయూబ్ తన పేరిట ఫిక్స్‎డ్ డిపాజిట్ చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో పాటు మిగిలిన డబ్బులకు కూడా సేవకు వినియోగించినట్టు ఫేక్ బిల్లులు సృష్టించింది రానా అయూబ్. దీంతో ఈ విరాళాలు వచ్చిన బ్యాంకు అకౌంట్లన్నిటితో పాటు 50లక్షల ఫిక్స్‎డ్ డిపాజిట్ లను కూడా ఈడీ జప్తు చేసింది. అంతేకాదు, ఈ విరాళాల్లో చాలావరకు విదేశీ నిధులు వచ్చినట్లుగా ఈడీ గుర్తించింది. ఇవి ఫారిన్ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం కూడా లేదని తేల్చింది.

ఇక రానా అయూబ్ నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది. దీంతో ఇన్నాళ్ళూ జర్నలిజం ముసుగులో అమాయకులను విరాళాలతో మోసం చేసిన రానా అయూబ్ ఆట ముగియబోతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

20 + 16 =