National

రాహుల్ గాంధీకి టైమిచ్చిన ఈడీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణకు రాలేనంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెప్పిన సంగతి తెలిసిందే. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఓ లేఖ రాశారు రాహుల్ గాంధీ. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్‌ గాంధీ. తన విచారణను జూన్ 20, సోమవారానికి వాయిదా వేయాలన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమోదించింది. సోమవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ తాజాగా సమన్లు ​​జారీ చేసింది. తన తల్లి సోనియా గాంధీని చూసుకునేందుకు గంగారామ్ ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ఈడీ అధికారులకు చెప్పారు. సోనియా గాంధీకి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రాహుల్ తన తల్లిని చూసుకోవడానికి గంగారామ్ ఆసుపత్రిలో రోజంతా గడపాలని భావిస్తున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ రాహుల్ గాంధీకి మూడు రోజులు పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేపట్టింది.

Related Articles

Back to top button