More

    ప్రూఫ్ లు లేకుండా ఆరోపణలు – EC నోటిసుతో ఇరకాటం

    ఆరోపణలు చేయడం..అదెంత పని..వెరీ ఈజీ. మరి రుజువులు చూపించండి అంటే మీన మేషాలు లెక్కెట్టేవారు. మెల్లగా సైలెంట్ అయిపోయేవారు తరుచు కనిపిస్తారు. అయితే, ఒకప్పుడు ఎడా, పెడా ఆరోపణలు చేసేసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత కు ఇప్పుడు ఈసీ నోటీసులు వచ్చాయి. ఆయన ఇసీకి ఏ ప్రూఫ్ లు చూపిస్తారో, ఏ ఎవిడెన్స్ లు అందజేస్తారో అనే విషయం ఉత్కంఠగా మారింది.

    సమ్ థింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్ అనే ఆరోపణలు చేశారో..మరెందుకు చేశారో తెలియదు కాని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, యూపీ ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయని ఈసీ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈసీ తాజా నోటిస్ కు సమాధానం ఇవ్వలేకపోతే మాత్రం..నథింగ్ ఈజ్ బెటర్ దేన్ నాన్సెన్స్ అని అఖిలేష్ సమాధాన పడే పరిస్థితి రావచ్చు.

    ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఎన్నికల సంఘం తారుమారు చేసిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అయితే, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్క మొరిగినట్టు..అన్న సామెతలు గుర్తుకుతెచ్చుకున్నా..అవేవి, ఆయన పట్టించుకోలేదు. ఈ ఏడాది మొదట్లో ఎన్నికలు జరిగితే, సెప్టెంబర్ 29 న అఖిలేష్ ఆరోపణలు గుప్పించారు.

    2022 ఎన్నికల్లో పార్టీ ఓటమి అంశంపై గత నెల 29న సమాజ్‌వాదీ పార్టీ జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ అధిష్ఠానం సంచలన ప్రకటన చేసింది. యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని యాదవ్, ముస్లిం వర్గాలకు చెందిన 20 వేల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఎస్పీ తెలియజేసింది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఈ ప్రకటనతో..అక్టోబర్ 27న ఎస్పీకి ఈసీ నోటీస్ జారీ చేస్తూ..ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంటరీ రుజువును సమర్పించాలని తెలిపింది. ఇందుకు సంబంధించిన రుజువులను 2022, నవంబర్ 10 లోపున సమర్పించాలని ఈసీ తెలిపింది. అసెంబ్లీ వారీగా తొలగింపుల డేటాపై నివేదికను సమర్పించాల్సిందిగా ఈసీ కోరింది.

    అయితే, తమ ఆరోపణలపై సమాజ్ వాది పార్టీ కాని, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కాని ఎన్నికల కమిషన్ కు అధికారికంగా ఏ విధమైన ఫిర్యాదు చేయలేదు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నాడు యూపీలో బీజేపీ 312 సీట్లు గెలుచుకుని గ్రేట్ విక్టరీ సాధించింది.

    నాటి ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు ప్రతిపక్ష నేతలు.. ఆడలేక మద్దిలోడు తీరులో ప్రవర్తించి..ఈవీఎం అంశాన్ని ప్రస్తావించి భంగపడ్డారు. తాము గెలిస్తే..ఈవీఎం, గీవియం జాంతా నహీ…వేరే వారు గెలిస్తే..అక్కసు, అసూయ, అసత్య ఆరోపణలు..ఇదే తీరులో విపక్షాలు వెళ్లడం, ప్రజాక్షేత్రానికి మరింత దూరం అవ్వడం జరుగుతోందని..బీజేపీ నేతలు అంటున్నారు.

    Trending Stories

    Related Stories