ప్రభుత్వ పాఠశాలలో మత ప్రచారం

0
846

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలోని K.A.R ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు మత ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 7వ తరగతి విద్యార్థులకు మత ప్రవచనాలు చెబుతూ మతపరమైన పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే పుస్తకంలో రోజు తప్పనిసరిగా ఒక పేజీ చదవాలని ఆ విధంగా చదివితే స్వర్గానికి చేరతారని ప్రవచనాలు చెబుతోంది. అలాగే ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని, ఒకవేళ చెబితే పరీక్షల్లో ఫెయిల్ కావడమే కాకుండా నరకానికి పోతారని బోధించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు మత ప్రచారం చేయడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డీఈవో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twelve + five =