More

    న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. తీవ్రత ఎంతంటే..?

    న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, న్యూ కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రత నమోదైనట్లుగా తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లుగా తెలిపింది.

    ప్రతి సంవత్సరం, న్యూజిలాండ్‌ను వేలాది భూకంపాలు వణికిస్తుంటాయి. న్యూజిలాండ్‌ లో గత నెల 15న భారీ భూకంపం వచ్చింది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్‌టన్‌ సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. పసిఫిక్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ సరిహద్దులో ఉన్నందున న్యూజిలాండ్ తరచుగా భూకంపాలకు గురవుతుంది. కెర్మాడెక్ దీవులు న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌కు ఈశాన్యంగా ఉన్నాయి.

    Trending Stories

    Related Stories