మణిపూర్ లో భూకంపం

0
814

మణిపూర్‌ రాష్ట్రంలో భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్‌లోని తౌబుల్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 40 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయి. అర్ధరాత్రి వేళ భూకంపం రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. మణిపూర్‌లో శుక్రవారం కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడించారు.