More

    ఇండోనేషియాను వణికించిన భూకంపం

    ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. పశ్చిమ జావా ప్రావిన్స్‌లో భూకంపం రావడంతో ప్రజలు ఎంతగానో భయపడిపోయారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి 20 మందికి పైగా మరణించగా, వందల్లో గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో సోమవారం కొన్ని సెకన్ల పాటు 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది. భూకంప కేంద్రం పశ్చిమ జావాలోని సియాంజార్ లో జకార్తాకు ఆగ్నేయంగా 75కి.మీ దూరంలో ఉంది. 10 కి.మీ (6.2మైళ్లు) లోతులో సునామీ వచ్చే అవకాశం లేదని బీఎంకేజీ తెలిపింది. భూ ప్రకంపనలతో పలు నివాసాలు నేలకూలాయని, మరికొందరు భవనాల శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తూ ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ పలు ప్రాంతాలకు చేరుకున్నాయి.

    Trending Stories

    Related Stories