ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు 4 సెకండ్ల పాటు భూమి కంపించడంతో, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రజలంతా గాడ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో… మోబిన్ పుర,ఫకీర్ గుట్ట,లక్కారం తదితర కాలని ప్రజలు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.