కొత్త సీజేఐగా డీవై చంద్రచూడ్..!?

0
808

జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత తదుపరి న్యాయమూర్తిగా ఎన్నికవడం దాదాపు ఖరారైపోయింది. కొలీజియం సాంప్రదాయం ప్రకారం అప్పటివరకున్న సీనియర్ న్యాయమూర్తిని సుప్రీం కోర్టు కొలీజియం భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో జస్టిస్ యుయు లలిత్ తదుపరి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ను సిఫారసు చేస్తూ కేంద్ర న్యాయశాఖా మంత్రికి లేఖ పంపారు. ఈ లేఖను న్యాయశాఖ భారత ప్రధాన మంత్రికి పరిశీలన కోసం పంపుతుంది. ప్రధాని ఆమోదిస్తే భారత రాష్ట్రపతి ఆమోదం తెలుపుపుతారు. అయితే ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తి యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. అన్నీ సజావుగా జరిగితే నవంబర్ 9వ తేదీన డీవై చంద్రచూడ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఈ పదవిలో ఆయన రెండేళ్ళపాటు కొనసాగుతారు. 2024 నవంబర్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనసాగనున్నారు.

జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11 వ తేదీన మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. దేశంలో ఏడు సంవత్సరాలపాటు న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు కూడా వైవీ చంద్రచూడ్ కు ఉంది. ఏడేళ్ళ నాలుగు నెలల పదవీకాలంతో సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా అప్పట్లో ఆయన రికార్డు సృష్టించారు. ఆయన రికార్డు ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. తండ్రి స్పూర్తితోనే కుమారుడు డీవై చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డి.వై. చంద్రచూడ్ తొలుత బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. 1998లో భారత ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా ఆయన సేవలందించారు.

ఆ తర్వాత 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా, ఆలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. 2016లో పదోన్నతి వచ్చిన తర్వాత డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో నియమితులయ్యారు. 2021 నుంచి సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా కొనసాగుతూనే,.. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గానూ వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత గోప్యత, శబరిమలలో మహిళల ప్రవేశం సహా అనే కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. అతను ఎదిగే సమయంలోనే తన న్యాయవాద వృత్తికి ఏమాత్రం రాజీ పడరనే పేరుకూడా డీవై చంద్రచూడ్ కు ఉంది. గతంలో ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పును సైతం డీవై చంద్రచూడ్ తప్పుబట్టారు.

ఇక భారత తదుపరి సీజేఐ గా డీవై చంద్రచూడ్ ఎన్నికవడంతో తదుపరి వచ్చే చట్టాలపై సుప్రీం కోర్టు ఏవిధంగా ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక చట్టాలను తీసుకువచ్చే అవకాశముంది. ఇందులో జనాభా నియంత్రణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ లతో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లాంటి చట్టాలను డీవై చంద్రచూడ్ వద్ద విచారణకు రానున్నాయి. దీంతో ఈ తీర్పులను చంద్రచూడ్ ఏవిధంగా భావిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =