సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

0
794

తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కార్మికులకు శుభవార్త. 2021-22 సంవత్సరానికి కంపెనీ లాభాల వాటాలో 30 శాతాన్ని రూ. 368 కోట్ల బోనస్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులకు దసరా పండుగ కానుకగా అందజేసేందుకు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది.