జ్ఞానవాపిపై పోస్టు పెట్టిన ప్రొఫెసర్‎ను ఏం చేశారో తెలుసా..?

0
708

వార‌ణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదుపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో జ్ఞాన్‌వాపి మసీదు విషయంపై ఢిల్లీ యూనివ‌ర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ సబ్జెక్ట్‌ అసోసియేట్ ప్రొఫెస‌ర్ ర‌త‌న్ లాల్ సోషల్‌ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

సోషల్‌ మీడియాలో..‘‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతిస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’’ అని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ లాయ‌ర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లాల్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ కింద ప్రొఫెస‌ర్‌ను అరెస్టు చేసిన‌ట్లు ఢిల్లీ సైబ‌ర్ పోలీసులు తెలిపారు. ప్రొఫెస‌ర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు లాయ‌ర్ త‌న ఫిర్యాదులో వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. జ్ఞాన్‌వాపి మసీదు సమస్యపై తాను కామెంట్స్‌ చేసిన తర్వాత తన 20 ఏళ్ల కుమారుడికి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో బెదిరింపులు వస్తున్నాయని రతన్‌ లాల్‌ తెలిపారు. లాల్ తన టీచింగ్ ఉద్యోగంతో పాటు, దళిత సమస్యలపై దృష్టి సారించే ‘అంబేద్కర్‌నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు.. రతన్‌ లాల్‌ అరెస్ట్‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఖండించారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘‘ప్రొఫెసర్ రతన్‌ లాల్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఆయనకు ఉంది.’’ అంటూ దిగ్విజయ్‌ కామెంట్స్‌ చేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here