International

ఏ మాత్రం వెనుకాడలేదు.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న ప్రధానమంత్రి

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ స్నేహితులతో కలిసి ప్రైవేట్ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ప్రైవేట్ పార్టీలలో డ్యాన్స్ చేయడం, పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిన్లాండ్‌కు చెందిన 36 ఏళ్ల నాయకురాలు.. పాటలు పాడుతూ నృత్యం చేసిన రెండు నిమిషాల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి. తనపై వస్తున్న ఈ వార్తలపై మారిన్ స్పందించారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని వివరించారు. వీడియో రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని.. వీడియో బయటకు రావడం విచారకరమన్నారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్ చేశామని పేర్కొన్నారు. అది చట్టబద్ధమేనని స్పష్టం చేశారు.

అయినా కూడా ప్రతి పక్షాలు నానా రచ్చ చేశాయి. దీంతో సనా మారిన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వారందరికీ ఒక క్లారిటీ ఇచ్చేయాలని డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు. సనా మారిన్‌ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. తానెప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని వివరించారు. ‘ఈ మధ్య నేను డ్రగ్స్ ఉపయోగించిన ప్రాంతాల్లో ఉన్నానని, లేదా నేను నేనే డ్రగ్స్ వాడానని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నేను చాలా తీవ్రమైనవిగా భావిస్తున్నా. డ్రగ్ టెస్టు చేయించుకోవాలని డిమాండ్ చేయడం అన్యాయంగా భావిస్తున్నప్పటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నేను ఈ రోజు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నా. దాని ఫలితాలు ఒక వారంలో వస్తాయి’అని సనా క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Back to top button