More

    సరికొత్త చరిత్ర.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము

    భారత 15వ రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ప్రతి రౌండ్‌లోనూ ఆధిపత్యంలో కొనసాగారు. చివరి రౌండ్‌ ముగిసే సరికి ముర్ము విజయం సాధించారు. ముర్ము 50 శాతం మార్కును అధిగమించారు. దీంతో ఆమె భారత దేశ 15వ, తొలి గిరిజన రాష్ట్రపతిగా మారనున్నారు. ఈ నెల 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేయనున్నారు.

    విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు. 3 రౌండ్లలోనూ ద్రౌపది భారీ ఆధిక్యం లభించింది. ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్‌ సిన్హాకు 1,058 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్‌ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు.

    Related Stories