National

డ్రోన్ల వినియోగంపై నిషేధం.. పాక్ ప్రభుత్వమే సమకూర్చిందా..!

జ‌మ్ములో ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌పై తొలిసారి డ్రోన్ దాడి జ‌రిగిన మ‌రుస‌టి రోజే మ‌రో రెండు డ్రోన్లు క‌నిపించాయి. జమ్మూలోని రత్నుచక్ ప్రాంతంలోని కుంజ్వానీ వద్ద కూడా అర్థరాత్రి డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయి. జమ్మూ డ్రోన్ దాడి కేసు దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కు అప్పగించినట్లు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. ప‌ఠాన్‌కోట్ నేష‌న‌ల్ హైవేపై కాలుచాక్‌-పూర్మాండ‌ల్ ప్రాంతంలో రెండు క్వాడ్‌కాప్ట‌ర్స్ క‌నిపించాయి. కాలుచాక్ మిలిట‌రీ స్టేష‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఎగురుతూ క‌నిపించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలతో జ‌మ్ము ప్రాంతంలోని ఆర్మీ స్టేష‌న్ల‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు.

డ్రోన్ల‌ వినియోగంపై రాజౌరి జిల్లా అధికారులు కొత్త ఆదేశాల‌ను జారీ చేశారు. డ్రోన్లు, ఎగిరే వ‌స్తువ‌ల వ‌ల్ల తీవ్రవాదులు దాడికి పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. దాని వ‌ల్ల మ‌నుషుల ప్రాణాల‌కు రిస్క్ ఏర్పాడుతున్న‌ట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో భావించారు. రాజౌరి జిల్లా అధికారులు డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. డ్రోన్ల‌ను దాచిపెట్ట‌డం, అమ్మ‌డం, వాడ‌డం, వాటిని ర‌వాణాకు వాడ‌డాన్ని నిషేధిస్తున్న‌ట్లు రాజౌరి అధికారులు చెప్పారు. ఇప్ప‌టికే డ్రోన్ కెమెరాలు, ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్న‌వాళ్లు వాటిని పోలీసుల వ‌ద్ద డిపాజిట్ చేయాల‌ని ఆదేశించారు. స‌ర్వేలు, మ్యాపింగ్‌, నిఘా కోసం ప్ర‌భుత్వం వాడే డ్రోన్లపై పోలీసులు నిఘా ఉంచారు.

జమ్మూ విమానాశ్రయంలోని ఎయిర్ బేస్ పై దాడికి వాడిన డ్రోన్లను పాకిస్థాన్ ప్రభుత్వమే సమకూర్చి ఉంటుందనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. 15 కోర్ కు చెందిన కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే కూడా డ్రోన్ దాడుల వెనుక తీవ్రవాదులకు పాక్ ప్రభుత్వం సహాయం చేసి ఉంటుందని అన్నారు. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోందని.. ఇలాంటి డ్రోన్లు, వాటి సాంకేతికతపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. దాడికి ఉగ్రవాదులు వాడిన ఈ డ్రోన్లు రోడ్డు పక్కన తయారు చేసినవి కాదని అన్నారు. ఖచ్చితంగా పాక్ ప్రభుత్వ మద్దతు ఉందని చెప్పారు. స్థానికంగా ఉన్న డ్రోన్లను దాడులకు వినియోగించేలా వాటిలో మార్పులు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు సహకరించి ఉండొచ్చన్నారు. జాతీయ భద్రతకు ఇలాంటి వాటి వల్ల ముప్పు వాటిల్లకుండా ఎదుర్కొనేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వాటిని ఎదుర్కొనేందుకు పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నామన్నారు.

జమ్మూ ఎయిర్ పోర్ట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల డ్రోన్ దాడి చోటు చేసుకుంది. ఆదివారం నాడు 5 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్ళు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ పేలుళ్ల కారణంగా ఇద్దరు అధికారులు గాయపడ్డారని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపింది. ఉదయం 1:37 సమయంలో ఒక బ్లాస్ట్, 1:42 సమయంలో మరో బ్లాస్ట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ గ్రూప్ ఒక డ్రోన్‌తో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) టవర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేయగా.. మరొకటి పార్క్ చేసిన ఐఎఎఫ్ హెలికాప్టర్ లేదా రాడార్‌ను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. ఆర్.డి.ఎక్స్. తో ఉన్న 5-6 కిలోగ్రాముల బరువున్న రెండు ఐఇడిలు.. 50 గజాల దూరంలో పడిపోయాయి. ఒకటి ఎటిసి నుండి 40 గజాల దూరంలో ఉంది, మరొకటి ఆపి ఉంచిన హెలికాప్టర్ నుండి అదే దూరంలో పడిపోయింది. అక్షాంశ-రేఖాంశాల ద్వారా డ్రోన్లను జారి విరచాలని భావించి లక్ష్యాలను కోల్పోయారని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × one =

Back to top button