ఎలుకే కదా అని వదిలేస్తే.. ప్రాణాలు తీసేస్తుంది.. ప్రపంచ దేశాలను హడలెస్తున్న DRDO సైబోర్గ్స్..!!

0
906

భారత సైనిక పరిశోధనా సంస్థ.. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.. మరో ఘనత సాధించబోతోంది. దేశ భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అత్యాధునికి పరికరాలకు ప్రాణంపోసిన DRDO.. తాజాగా మరో కొత్త ఆయుధాన్ని సృష్టించబోతున్నది. అది ప్రాణం ఉన్న ఆయుదం. కలుగులోదాగివున్న శత్రువు కదలికలను ఎప్పటికప్పుడు కళ్లకుకట్టినట్లు చూపే మూషికాస్త్రం. సరిహద్దుల్లో మన శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు కొద్ది రోజుల క్రితం డేగలకు శిక్షణ ఇచ్చారు మన సైనికులు. తాజాగా ఎలుకసాయంతో ఇంటా, బయటా మన శత్రువుల కదలికలకు చెక్ పెట్టబోతున్నారు. దీనికి సైబోర్గ్స్‎గా నామకరణం చేశారు. ఇంతకు ఇది ఎలా పనిచేస్తుంది..? సైబోర్గ్స్ ప్రత్యేకలు ఏంటి..? సైన్యానికి ఎలా ఉపయోగపడుతుంది..? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

చట్టూ శత్రుదేశాలు. సరిహద్దుల్లో అనుక్షణం ఉద్రిక్తతలు. అందుకే, భారత ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతను ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తూ ఉంటుంది. మన సైనికులు శత్రువుల కదలికలను డేగ కళ్లతో పహాకాస్తున్నారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా వారికి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. అందుకే, కాలానుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. శత్రువుకు చెక్ పెడుతోంది మోదీ సర్కార్. రక్షణ రంగంలో బాంబులు, మందు సామగ్రి సరఫరా, ఆయుధాలు ఎంత అవసరమో, సాంకేతికతను ఉపయోగించడం అంతే అవసరం. యుద్ధం, సీక్రెట్ మిషన్ల వల్ల తమ సైనికులకు ఎక్కువ నష్టం వాటిల్లాలని ఏ దేశమూ కోరుకోదు. ఈ పరిస్థితుల్లో ప్రాణ నష్టం లేకుండా శత్రువులను తుదముట్టించేందుకు పనికొచ్చే ఆయుధం రోబోటిక్స్. అయితే రోబోటిక్స్‌ను ఏ విధంగా వాడాలన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. ఎందుకంటే.. శత్రువులు కూడా రోబోటిక్స్‎పై రోజురోజుకూ అవగాహన పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో శత్రువు కూడా పసిగట్టలేని రోబోటిక్స్‌ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయగలిగితేనే శత్రువు ఆటకట్టించవచ్చు. ఆ పనే ఇప్పుడు మన DRDO చేస్తోంది.

రోబోటిక్స్ లో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఆండ్రాయిడ్ రోబోట్. రెండవది సైబోర్గ్స్ ర్యాట్. ముందుగా ఆండ్రాయిడ్ రోబోట్ గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ అనగానే మనకు మొబైల్ ఫోన్ లో వాడే సాఫ్ట్ వేర్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మనం వాడే మొబైల్స్ లో ఆండ్రాయిడ్ దే హవా. కానీ.. మనం చెప్పకోబోయే ఆండ్రాయిడ్ దీనికి భిన్నంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ రోబోట్లు మానవ ఆకృతిని పోలి ఉంటాయి. ఇది టెక్నాలజీకి ఒక మోడల్ మాత్రమే. ఇక అసలు టాపిక్ లోకి వద్దాం. ఇక మనం మాట్లాకుంటున్న సైబోర్గ్స్.. ఒక ప్రాణం ఉన్న జీవులు. అందుకే ఇది రక్షణ రంగంలో చాలా కీలకంగా మారబోతుంది.

DRDO ఇప్పుడు రక్షణ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, శత్రువుల జాడ కనిపెట్టి వారి రహస్య సమాచారాన్ని సేకరించేందుకు సైబోర్గ్స్ అనే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌ చేపట్టింది. విశేషమేమిటంటే,.. ఇందులో ఎలుకలను రోబోలుగా ఉపయోగించబోతున్నారు. DRDOలోని DYSL-AT శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్నారు. ఈ టెక్నాలజీలో మూషికం తలపై కెమెరాలు అమరుస్తారు. దాని మెదడును రిమోట్‌ సాయంతో నియంత్రిస్తారు. అదన్నమాట సంగతి. ఇక సరిహద్దుల్లో ఇవి ఎలా ఉపయోగపడతాయో మీకు ఇప్పటికే ఓ అవగాహన వచ్చి ఉమటుంది. సైబోర్గ్స్ గురించి.. DYSL-AT డైరెక్టర్ పి. శివ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే.. మన దేశం ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌పై పని చేయడం ఇదే మొదటిసారి. కొన్ని దేశాలు ఇప్పటికే ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ నుంచి నిఘా వరకు భద్రతా దళాలకు ఇది చాలా ఉపయోగకరం.

సైబోర్గ్స్ ర్యాట్ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టులో మొత్తం రెండు భాగాలు ఉంటాయని DRDO అధికారులు చెబుతున్నారు. ముందుగా ఎలుకలు ఆదేశాలను పాటించేలా ఆపరేటర్ల ద్వారా శిక్షణ ఇస్తారు. ఏం చేయాలి..? అనే అంశంపై అన్ని రకాల సూచనలను ఎలుకలకు అందజేస్తారు. తర్వాత.. తలపై చిన్నపాటి కెమెరాలు ఏర్పాటుచేస్తారు. దీనిద్వారా ఎలుక ప్రయాణం చేసే మార్గంలో ఏమున్నాయో తెలుసుకోవడానికి వీలుంటుంది. అయితే ఎలుక మెదడును ఒక వ్యక్తి రిమోట్‌ కంట్రోల్ సాయంతో నియంత్రిస్తాడు. ప్రాజెక్ట్‎లోని మొదటి దశ సాఫీగా పూర్తయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శస్త్రచికిత్స ద్వారా ఎలుకలలో ఎలక్ట్రోడ్లు అమర్చామంటున్నారు. ఇవి రిమోట్ కంట్రోల్ ద్వారా నావిగేట్ చేస్తాయన్నారు. ప్రాథమిక దశలో భాగంగా.. DRDO మూడు-నాలుగు ఎలుకలపై మాత్రమే పరీక్షలు చేసిందని చెబుతున్నారు.

ఎలుకలకు పట్టుదల ఎక్కువ. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు ఎలుకలే ఉత్తమమైనవిగా భావించామని అధికారులు చెప్పారు. చెప్పిన పని చెప్పినట్లుగా చేసిన ఎలుకలకు రిటర్న్ గిఫ్ట్‎గా వాటికి మంచి పసందైన ఫుడ్ ఇస్తామన్నారు. తర్వాత టాస్క్ కోసం అవి మరింత ఉత్సాహం చూపించడానికి ఇది పనిచేస్తుందంటున్నారు. వేగంగా పరిగెత్తడం, చేరుకోలేని ప్రదేశాల్లోకి ఈజీగా చేరుకోవడం, మెట్లు ఎక్కడం, లక్ష్యాలను కనుగొనడం వంటి వాటిలో మూషికాలకు మించిన జీవులు లేవు. అందుకే ఇవి రక్షణ రంగానికి ఉత్తమమైన సాధనాలుగా నిరూపితం అవుతాయంటున్నారు అధికారులు. ఒక వేళ ఏదైనా తేడా వచ్చి మధ్యలోనే ఎలుక ఆగిపోతే, రిమోట్ ద్వారా వాటిని కంట్రోల్ చేస్తూ.. టాస్క్ పూర్తి పూర్తి చేసేలా ప్రేరేపిస్తారు. ఇదే ఈ ప్రాజెక్టులో ప్రధాన ప్రత్యేకత.

26/11 నాటి ముంబై ఉగ్రదాడి మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ఉగ్రవాదులు హోటల్‌లో టూరిస్టులను బందీలుగా ఉంచారు. నానా భీభత్సం సృష్టించారు. ఈ దాడిలో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భద్రతా దళాలకు రెండు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది, ఎందుకంటే లోపల ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు..? వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి..? ఎంత మంది బందీలుగా ఉన్నారు..? అనే సమాచారం భద్రతా బలగాలకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడానికే.. ఎలుకలను సైబోర్గ్‌లుగా తయారు చేస్తున్నారని, ఇది శత్రువుకు సంబంధించిన ప్రతి కదలికనూ కళ్లముందు ఉంచుతుంది. వీటిని చూసిన శత్రువు సాధారణ ఎలుకలుకే కదా అని అనుకుంటాడు. ఈ మూషికాలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో.. భద్రతా దళాల పని సుళువుగా మారుతుంది. శత్రువు ఆటకట్టిచేందుకు మార్గం సుగమమవుతుంది. గంటల పని నిమిషాల్లో పూర్తవుతుందని DRDO చెబుతోంది.

మరి, సైబోర్గ్ ప్రాజెక్ట్ ఇంత వరకు ఎవరూ చేపట్టలేదా..? అన్న విషయానికి వస్తే.. ఇదివరకు మరో రెండు దేశాలు ప్రయోగాలు చేశాయి. 2014 లో అమెరికా తన సైబోర్గ్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 2019 లో చైనా కూడా సైబోర్గ్‌ను అభివృద్ధి చేసింది. ఎలుక మనస్సును మానవ మేధస్సు ద్వారా నియంత్రించవచ్చని వారి ప్రయోగ ఫలితాల్లో తేలింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా బయటికొచ్చాయి. తాజాగా మన దేశం కూడా ఈ ప్రాజెక్ట్‌‎పై పెద్ద ఎత్తున పనిచేస్తోంది. అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‎గా తీసుకుని ప్రయోగాలు చేస్తోంది. ఈ రకమైన టెక్నాలజీని ఒక్క ఎలుకలపై మాత్రమే కాకుండా మరి కొన్ని జంతువులపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

సౌత్ కరోలినా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు డాల్ఫిన్లకు సెన్సార్లు, ఇతర పరికరాల సహాయంతో నీటి అడుగున ఉన్న విలువైన సంపదను, గనులను గుర్తించడానికి ఉపయోగించారు. శత్రుల జాడ కనిపెట్టి, వారిపై దాడుల కోసం ఉత్తర కొరియా డాల్ఫిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ రకమైన ప్రాజెక్ట్‌లో విజయం సాధించాయి. అందుకే భారతదేశం కూడా ఈ ప్రాజెక్ట్‌ ను చేపట్టింది. అయితే దీనిపై అంభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. PETA వంటి సంస్థలు భారతదేశంలో సైబోర్గ్ జంతువుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాలు మూగజీవాల సహజ లక్షణానికి విఘాతం అని అరోపిస్తున్నాయి. నిజానికి, PETA ఆరోపిస్తున్నట్టు ఎలుకల ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదు. అయితే ఇలాంటి సందర్భాల్లోనే PETA ద్వంద నీతి బట్టబయలు అవుతుంది. ఆవు పాలు తాగడంపై నిషేధం విధించాలంటుంది. కానీ.. ఆవుల పట్ల క్రూరత్వం గురించి, బక్రీద్ రోజున మేకలు, క్రిస్మస్ రోజున టర్కీ కోళ్లను కోసుకుని తినేవాళ్ల గురించి మాత్రం పెదవి విప్పదు.

PETA ద్వంద్వ ప్రమాణాలు భారత రక్షణ రంగం కోసం చేపట్టిన అత్యుత్తమ ప్రాజెక్టు ప్రభావితం కాకూడదని భాతీయులంతా భావిస్తున్నారు. ఎందుంకటే.. DRDO చేపట్టిన ఈ ప్రాజెక్ట్ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకువస్తుంది. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు తోపాటు.. మిలటరీ సీక్రెట్ ఆపరేషన్స్ వరకు ఎన్నో రకాలుగా ఈ ప్రాజెక్టు ను ఉపయోగించవచ్చు. శాస్త్రవేత్తలు కూడా అనుకున్న ఫలితాలు సాధించి విజయంపొందడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. DRDO ప్రయోగం విజయంవంతం కావాలని భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను. త్వరలో శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్నాను. మరి, మీరేం కోరుకుంటున్నారు..? ఈ ప్రాజెక్టుపై PETA అభ్యంతరాలను మీరు ఎలా చూస్తారు..? మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి. అలాగే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పది మందికీ షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం.. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్‎పై క్లిక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్‎ను సబ్‎స్క్రయిబ్ చేసుకుని.. తెలుగునాట జాతీయ వాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.