DRDO మరో రికార్డు.. యాంటీ షిప్ మిసైల్స్ ను కట్టడి చేసే ఛాఫ్ రాకెట్స్ ప్రయోగం విజయవంతం

0
721

ఛాఫ్ అనేది ఒక ఎలెక్ట్రానిక్ కౌంటర్ మేజర్ టెక్నాలజీ. దీనిని ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలు తమ నేవీ షిప్స్ ని రక్షించుకోవడానికి వాడుతున్నాయి. ముఖ్యంగా రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ గైడింగ్ మెకానిజంలని రక్షించుకోవడానికి ఈ చ్చాఫ్స్ వాడతారు.

వరస ప్రయోగాలతో DRDO మరో రికార్డు సృష్టించింది. తాజాగా DRDO భారత నేవీ కోసం ఆత్యాధునిక ఛాఫ్ రాకెట్స్ ని విజయవంతంగా పరీక్షించింది.

ఛాఫ్ రాకెట్స్ అంటే ఏమిటి ? అవి ఎలా పనిచేస్తాయి ? వాటి అవసరం ఏమిటి ?

ఛాఫ్ రాకెట్స్ అనేవి యుద్ధ నౌకల ప్రాధమిక రక్షణ కోసం వాడతారు. ఏదయినా శత్రు దేశపు యుద్ధ విమానం నుండి ప్రయోగించిన యాంటీ షిప్ మిసైల్ కనుక అన్నీ రక్షణ వలయాలని తప్పించుకొని నేరుగా యుద్ధ నౌక మీదకి దూసుకొస్తున్న తరుణంలో ఆఖరి ప్రయత్నంగా ఛాఫ్ రాకెట్స్ ని ప్రయోగిస్తారు. ఇవి Short Range Chaff Rocket , Medium-Range Chaff Rocket, Long Range Chaff Rocket అని మూడురకాలు. శత్రు దేశపు యాంటీ షిప్ మిసైల్ తనకి సమీపం లోకి వచ్చే సమయంలో ఈ చాఫ్ రాకెట్స్ ప్రయోగించగానే అవి గాల్లోకి లేచి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి.. పేలిపోయి విపరీతమయిన వేడిని పుట్టిస్తాయి ఆ వేడిని బేస్ చేసుకొని శత్రు దేశపు మిసైల్ గైడింగ్ మెకానిజంని తప్పు దోవ పట్టించి వాటి మీదకి వెళ్ళి అక్కడే పేలిపోతుంది. DRDO కి చెందిన డిఫెన్స్ ఫెసిలిటీ జోధ్పూర్ డిఫెన్స్ లాబొరేటరీ వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో అభివృద్ధి చేసింది.

టెక్నికల్ గా వీటిలో చాలా రకాలు ఉన్నాయి కానీ మన శత్రు దేశం ఎలాంటి మిసైల్స్ ప్రయోగిస్తుందో తెలుసుకుని.. దానికి అనుగుణం గా ఈ ఛాఫ్స్ తయారుచేస్తారు. ఇంతకు ముందు అవసరమైనపుడు వీటిని మనం దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పడు సొంతంగా తయారు చేసుకునే స్థితికి రాగలిగాం. నిన్న అరేబియా సముద్రం లో భారత యుద్ధ నౌక నుండి ఈ చాఫ్స్ ని పరీక్షించి మన నేవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఛాఫ్ అనేది ఒక ఎలెక్ట్రానిక్ కౌంటర్ మేజర్ టెక్నాలజీ. దీనిని ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలు తమ నేవీ షిప్స్ ని రక్షించుకోవడానికి వాడుతున్నాయి. ముఖ్యంగా రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ గైడింగ్ మెకానిజంలని రక్షించుకోవడానికి ఈ చ్చాఫ్స్ వాడతారు.

ఇటీవళ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ DRDO శాస్త్రజ్ఞులని, భారత నేవీ అధికారులని అభినందించారు. పెద్ద మొత్తంలో వీటిని ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

DRDO ఛైర్మన్ సతీష్ ఈ క్రిటికల్ టెక్నాలజీ మీద పనిచేసిన బృంద సభ్యులకి అభినందనలు తెలియచేసారు.

ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటి వరకు ఈ ఛాఫ్ రాకెట్స్, ఛాఫ్ లాంచర్స్ ని చాలా చిన్న దేశాలనుండి కొంటూ వస్తున్నామంటే గత పాలకుల పనితనం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదటిసారిగా అత్యాధునిక ఛాఫ్ రాకెట్స్ ని మన స్వంత టెక్నాలజీ తో అభివృద్ధి చేసి మరీ తయారుచేస్తున్నాము అంటే దీని వెనుక DRDO కృషి, అంకిత భావమే కారణం.

కేంద్రం అందిస్తున్న సహకారంతో DRDO చేసిన వివిధ ఆయుధాల పరీక్షలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి అవి కూడా 90% ఆక్యురెసీతో. DRDO లాంటి డిఫెన్స్ సంస్థ మీద రాజకీయ ఒత్తిడిలు లేకుండా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఒక సారి 2014 నుండి ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు, విజయాలు, వాటికి లభించిన అనుమతులని చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. సరైన సమయంలో నిధులు ఇవ్వడం మీదనే ఇదంతా సాధ్యం అయ్యిందని చెప్పవచ్చు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 + 8 =