రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి రానున్న ద్రౌపది ముర్ము

0
674

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఏపీలో అడుగుపెట్టనున్నారు. డిసెంబర్‌ 5వ తేదీన విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ రాష్ట్రపతి పర్యటన కోసం సన్నాహాలు చేస్తోంది. రాయచోటి–అంగల్లు సెక్షన్‌ జాతీయ రహదారిని, జాతీయ రహదారి–205పై నాలుగు లేన్ల ఆర్వోబీ–అప్రోచ్‌ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పూర్తి షెడ్యూల్‌ను ఖారారు చేయాల్సి ఉంది.