భారతదేశంలో రష్యన్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’ పై ఫేజ్ -3 ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దరఖాస్తును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) తిరస్కరించింది. సింగిల్-డోస్ వ్యాక్సిన్ ఫేజ్ -3 ట్రయల్స్ నిర్వహించడానికి సంస్థను అనుమతించడంలో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) ఎటువంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించలేదని వెల్లడించారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దేశంలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ నిర్వహణకు అనుమతిని నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన ఎస్ఈసీ నిపుణులు స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ చేయడానికి ఎలాంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించట్లేదని.. కాబట్టి రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెడ్డీస్ ట్రయల్స్ చేయాలనుకుంటున్న స్పుత్నిక్ లైట్ స్పుత్నిక్ వీలో మొదటి డోసేనని అంతకుముందు స్పుత్నిక్ వీకి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ ప్రభావం గురించి ముందే తెలిసింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ డేటా చూస్తే అది అంత ప్రభావవంతం కాదని తేలింది. మేలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత లక్షన్నర డోసులను రష్యా పంపించగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు 30 లక్షలకుపైగా డోసులను పంపించింది.
జైడస్ క్యాడిలా అందుబాటులోకి:
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జై కొవ్-డీ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జై కొవ్-డీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే కరోనా కట్టడికి అభివృద్ధి చేసిన తొలి డీఎన్ఏ టీకా. 12 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయడానికి అత్యవసర వినియోగ అనుమతి కోసం ఆ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ఇటీవలే ముగిశాయని ఆ సంస్థ తెలిపింది. జై కొవ్-డీ వ్యాక్సిన్ డీఎన్‌ఏ టీకా అని, వైరస్‌కు సంబంధించిన జన్యుకోడ్‌ను మన శరీరంలోకి తీసుకెళ్తుందని దీంతో వ్యాధి నిరోధక శక్తి వస్తుందని ఆ సంస్థ తెలిపింది.
జై కొవ్-డీ వ్యాక్సిన్ ఆమోదం పొందితే రెండో దేశీయ కరోనా టీకాగా నిలుస్తుంది. అత్యవసర అనుమతులు లభించగానే టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. తొలి డోసు వేయించుకున్న తర్వాత 28 రోజులకి రెండో డోసు, 56 రోజులకి మూడోది వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ చాలా కాలం నిల్వ ఉండాలంటే 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, కొద్ది కాలం నిల్వ ఉండాలంటే 25 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది.