More

  2డీజీ డ్రగ్ ఇకపై మార్కెట్ లో.. ధర ఎంతంటే..!

  కరోనా మహమ్మారి పనిపట్టేందుకు భారతీయ శాస్త్రవేత్తలు 2డీయాక్సీ డీ-గ్లూకోజ్ రూపొందించిన సంగతి తెలిసిందే..! 2డీజీగా చెప్పుకుంటున్న ఈ ఔషధం కరోనాను అరికడుతోందని ఇప్పటికే చెప్పారు. భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీఓ 2డీజీ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా కొద్దిరోజుల కిందట విడుదల అయిన సంగతి తెలిసిందే..! పౌడర్ రూపంలో వుండే ఈ మందును సాషేల రూపంలో కరోనా పేషెంట్లకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందిస్తున్నారు. తొలి విడతలో 10 వేల సాషేలను అందుబాటులోకి తెచ్చారు. జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తెలిపింది.

  అనుకున్నట్లుగానే మార్కెట్ లోకి 2డీజీ వచ్చేసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఔషధం భారతదేశం అంతటా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ -19 ఆరోగ్య సౌకర్యాలకు సరఫరా చేయబడుతుంది. ఈ మందులు మొదట్లో మెట్రో, టైర్ 1 నగరాల్లోని ఆసుపత్రులలో లభిస్తాయి. తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కవరేజీని విస్తరిస్తాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఔషధానికి 99.5 శాతం స్వచ్ఛత ఉందని కంపెనీ తెలిపింది. వైద్యుడి పర్యవేక్షణలో కోవిద్ రోగులకు అదనపు చికిత్సగా ఈ ఔషధాన్ని ఇవ్వనున్నారు. 2-డిజి యొక్క ప్రతి సాచెట్ ఒక్కో సాచెట్‌కు రూ .990 గా నిర్ణయించబడింది. ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనున్నారు.

  2డీజీ ఔషధాన్ని అందించిన పేషంట్లకు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోందని.. సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది వాడినవారికి ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ కూడా వచ్చిందని స్పష్టం చేశారు. పొడి రూపంలో వున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధం తీసుకున్న కొన్ని గంటల్లోనే కరోనా అంతమవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణానలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో నిరూపితమైంది. క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకుంటున్నారని డీఆర్డీఓ తెలిపింది. గతంలో ఈ మందును క్యాన్సర్‌ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కరోనాకు అన్వయించుకుని పరిశోధనలు చేసిన డీఆర్డీఓ సైంటిస్టులు విజయం సాధించారు. ప్రస్తుతానికి, పొడిరూపంలో అందిస్తున్న ఈ మందును మూడో దశ ట్రయల్స్ పూర్తయిన తర్వాత టాబ్లెట్ల రూపంలో అందించినున్నట్టు తెలుస్తోంది.

  Trending Stories

  Related Stories