భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఫ్లూయిడ్స్ ఇస్తోందని.. డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు అందిస్తోందని అధికారిక ప్రకటన వచ్చింది. జ్వరంతో పాటు శ్వాస సమస్యలు, చెస్ట్ పెయిన్ ఉన్నట్లు తెలుస్తున్నది. వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మంగళవారం అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఎయిమ్స్ లో చేర్చారు. మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా బారినపడ్డారు. జ్వరం ఉండడంతో ఎయిమ్స్‌లో చేర్పించిన సమయంలో కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు మార్చి 4న, ఏప్రిల్ 3న కొవిడ్ టీకా తీసుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీలకు అతీతంగా ప్రార్థిస్తూ ఉన్నారు.