గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచడమే కాకుండా.. ఈ ధర నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.188కి పెంచగా.. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై మాత్రం రూ.8.50 తగ్గించింది. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. నేడు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ పై మాత్రం ధరను పెంచాయి.