More

    అతడికి అన్నీ తెలిసే ఈ పని చేశాడు: అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి చికిత్స చేసిన వైద్యుడు

    గోరఖ్‌నాథ్ దేవాలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి చికిత్స అందించిన వైద్యుడు అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడనే వాదనలను ఖండించారు. గోరఖ్‌పూర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ చీఫ్ జెఎస్‌పి సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల సమయంలో నిందితుడు బాగా మాట్లాడుతున్నాడని అన్నారు. పోలీసులు, వైద్యులు అడిగిన ప్రశ్నలకు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ సమాధానమిచ్చాడు. అహ్మద్ ముర్తాజా అబ్బాసీ మానసికంగా అస్థిరంగా లేడనే ఎటువంటి సాక్ష్యాలు వైద్యుల వద్ద లేవని ఆయన అన్నారు.

    అబ్బాసీకి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు జెఎస్‌పి సింగ్ అందుబాటులో లేనప్పటికీ, కేసు గురించి అతనికి వివరించిన వైద్యుడు అబ్బాసీ ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉన్నాడని తెలిపారని JSP సింగ్ చెప్పారు. “పోలీసులు అతని చుట్టూ తిరుగుతున్నందున అతనికి చికిత్స చేసిన డాక్టర్ అతనితో మాట్లాడలేకపోయాడు. చికిత్సకు సహకరిస్తున్నాడు. చికిత్స సమయంలో, పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు, దానికి అతను ప్రశాంతంగా సమాధానం చెప్పాడు.” అని జెఎస్‌పి సింగ్ తెలిపారు.

    ఇంటెలిజెన్స్ పంపిన అనుమానితుల జాబితాలో ముర్తజా పేరు
    మార్చి 31న గూఢచార సంస్థలు 16 మంది అనుమానితుల జాబితాను యూపీ పోలీసులకు పంపాయని పేర్కొంది. జాబితాలో అహ్మద్ ముర్తజా పేరు ఉంది. గతంలో, ముర్తజా ATS స్కానర్‌లో ఉన్నట్లు నివేదించబడింది. తదుపరి విచారణ కోసం దర్యాప్తు సంస్థలు ముర్తాజా ఇంటిని సీల్ చేశాయి.

    గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి
    ఏప్రిల్ 3న, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వెలుపల అహ్మద్ ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. పదునైన ఆయుధంతో ఇద్దరు పోలీసు సిబ్బందిని అబ్బాసీ తీవ్రంగా గాయపరిచాడు. అబ్బాసీని పోలీసు సిబ్బంది అడ్డుకునే సమయంలో మరొక వ్యక్తి తప్పించుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. విచారణలో అహ్మద్ ముర్తాజా అబ్బాసీ నిషేధిత ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ద్వారా ప్రభావితమయ్యాడని, ISIS తో సంబంధాలు కలిగి ఉండవచ్చని భద్రతా సంస్థలు కనుగొన్నాయి.

    Trending Stories

    Related Stories