More

    సారీ చెప్పినా.. షోకాజ్ తప్పలేదు.. 2జీ ఏ రాజాకు ఎన్నికల సంఘం ఝలక్

    షోకాజ్‌ నోటీసులో.. డీఏ రాజా ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండడమే కాకుండా మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్లుగా ఉన్నాయని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ కింద తీవ్ర నిబంధనల ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది.

    తమిళనాట రాజకీయ ప్రచార పర్వంలో భాగంగా.. తమ పార్టీ అధినేత స్టాలిన్ మెప్పుకోసం.. అతడి కాలి చెప్పుతో పోల్చిన వైనంతో 2జీ ఏ రాజా వ్యవహారం ఇప్పుడు ఎన్నికల సంఘం వద్దకు చేరింది. దీంతో కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాపై ఫిర్యాదు అందడంతో ఈ మేరకు నోటీసులు ఇచ్చింది.
    తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆయన తల్లినిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రాజాపై అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చిన గడువులోగా వివరణ ఇవ్వాలని రాజాను ఈసీ ఆదేశించింది. ఒకవేళ స్పందించకుంటే గనక తదుపరి ప్రస్తావన లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. షోకాజ్‌ నోటీసులో.. డీఏ రాజా ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండడమే కాకుండా మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్లుగా ఉన్నాయని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ కింద తీవ్ర నిబంధనల ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది. అయితే అంతకుమునుపే తాను చేసిన వ్యాఖ్యల తీవ్రతను గ్రహించిన ఏ రాజా పళనిస్వామికి మీడియా ముఖంగా క్షమాపణలు కోరారు.
    మరో పక్క, పశ్చిమ బెంగాల్ లో ఓ సబ్ డివిజనల్ పోలీసు అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ అతనిపై బదిలీవేటు విధించింది. నందిగ్రామ్ లలో కొందరు పోలీసు అధికారులు టీఎంసీ అభ్యర్థుల ఎన్నికల అక్రమాలకు సహకరిస్తున్నారని, వారిని సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుడు సువెందు అధికారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ హల్దియా సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ బరూన్ బైద్యను తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ ఎస్డీపీఓ బరూన్ బైద్యను ఎలాంటి ఎన్నికల విధుల్లో నియమించరాదని ఈసీ ఆదేశించింది. ఆయన స్థానంలో ఉత్తమ్ మిత్రాను కొత్త హల్దియా ఎస్డీపీఓగా ఈసీ నియమించింది.
    ఇలా పలుచోట్ల కొందరు నేతలు, అధికారులు ఎన్నికల కోడ్ లను ధిక్కరిస్తుండడంతో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేదుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. కంప్లైంట్ అందిన గంటల్లో తగు విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటోంది.

    Trending Stories

    Related Stories