భూమి పూజను అడ్డుకున్న డీఎంకే ఎంపీ.. హిందూ దేవుళ్లపై ఎందుకంత అక్కసు..?

0
803

హిందూ దేవుళ్లంటే అలుసు.. హిందూ దేవాలయాలంటే అక్కసు.. హిందూ సంస్కృతి అంటే ఈర్ష. దేవుళ్లను అవమానించలే పోస్టులు పెట్టడం.. హిందువులను చులకనగా చూడటం.. దేవతలను అసహస్యంగా చిత్రీకరించడం పరిపాటిగా మారింది.

నిత్యం హిందూ దేవాలయాలపై దాడులు చేయడం.. హిందూ సాంప్రదాయాలను హేళన చేయడం.. అడ్డుకున్న వారిని అతి దారుణంగా హత్యలు చేయడం తరుచూ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణాలు మరింతగా పెరిగిపోయాయి. మరోవైపు ముస్లిం వర్గం చేస్తున్న అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కేవలం హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం ఓ వర్గానికి అలవాటుగా మారింది. తాజాగా వెలుగుచూసిన ఓ ఘటన కూడా ఈ కోవ కిందకే వస్తుంది. తమిళనాడులో ఓ ప్రజాప్రతినిధి ప్రవర్తన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా ఆలంపురం గ్రామంలో ఒక చెరువు పునరుద్ధరణ పనుల కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భూమి పూజ చేపట్టారు. ఆ కార్యక్రమానికి డీఎంకే పార్టీకి చెందిన ధర్మపురి ఎంపీ ఎస్.సెంథిల్ కుమార్ కూడా వచ్చారు. భూమి పూజ కార్యక్రమంలో హిందూ పూజారి మాత్రమే ఉండటం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పూజలు ఎలా చేస్తారంటూ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రభుత్వ కార్యక్రమంలో పూజలు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ పనుల్లో మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారన్నారు. ఒకవేళ చేయిస్తే మిగతా మతాల వాళ్లు ఏక్కడ అంటూ విరుచుకుపడ్డారు. నాస్తికులు, క్రైస్తవులు, ముస్లింలు, ఇతర మతాలు వారు కూడా ఉండాలి కదా? అంటూ చిందులేశారు. ద్రవిడార్ కజగం ప్రతినిధులు, ఫాదర్, ఇమామ్‌లను కూడా పిలిపించండంటూ సెంథిల్ కుమార్ అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవిడార్ కజగం అనేది ఒక హేతువాద సంస్థ. దీన్ని పెరియార్ రామస్వామి ప్రారంభించారు. దీని నుంచే డీఎంకే పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలు చేయకూడదని మీకు తెలుసా? లేదా అంటూ అధికారిని సెంథిల్ కుమార్ ప్రశ్నించారు. సంబంధిత శాఖా మంత్రి అనుమతితోనే తాను ఈ పూజ ఏర్పాటు చేశానని ఆ అధికారి బదులిచ్చారు. ఎవరు మీకు అనుమతిచ్చారు? ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొనే కార్యక్రమాల్లో ఇలాంటి పూజలు మీరు చూశారా? అంటూ గుస్స అయ్యారు. ఇది ద్రవిడ ప్రభుత్వమని.. ఈ ప్రభుత్వం అన్ని మతాలు, విశ్వాసాల వారికి చెందిందని సదరు ఎంపీ హితవు పలికారు.

చివరకు భూమి పూజను సెంథిల్ కుమార్ ఆపించారు. అయితే ఆలంపురం చెరువు వద్ద పూజా సామాగ్రి, చేసిన ఏర్పాట్లు తొలగించిన తరువాత మాత్రమే పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి ఎంపీ సెంథిల్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పనుల్లో ఒక మతానికే చెందిన కార్యక్రమాలు చేపట్టొద్దని, గతంలో చాలా సార్లు చెప్పానని ఎంపీ అన్నారు. ఈ కారణం వల్లనే అనేక కార్యక్రమాల నుంచి తాను మధ్యలోనే వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ ఘటన మీద మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోందంటే, దానికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో ఉంది కాబట్టి అంటూ చెప్పుకొచ్చారు. ఇతర మతాల వారిని ఎందుకు పిలవడం లేదని ప్రతిసారీ అధికారులను అడుగుతూనే ఉంటానన్నారు. పిలిస్తే అన్ని మతాల వారినీ పిలవాలని… లేదంటే పూజలే పెట్టకండన్నారు. అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలు అవసరం లేదన్నారు. అన్నాదురై, కరుణానిధి పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో దేవుళ్ల బొమ్మలు పెట్టడానికే అధికారులు భయపడేవాళ్లని గుర్తు చేశారు. తమ పార్టీ సభ్యుల్లో దేవుళ్లను నమ్మేవాళ్లు ఉండొచ్చని… తమ ఓటర్లు కూడా ఆస్తికులు కావచ్చన్నారు. అదంతా వారి వ్యక్తిగతమని… కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలు చేయడాన్ని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

వారి నమ్మకాలు, విశ్వాసాలు వాళ్ల ఇంటి వరకే పరిమితమైనప్పుడు సమస్యలేదన్నారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక మతానికి సంబంధించిన పూజలు మాత్రమే నిర్వహించడం, అందులో పాల్గొనడం తప్పని హితవు పలికారు. డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు దీని గురించి తప్పకుండా ఆలోచించాలని ఎంపీ సెంథిల్ అన్నారు. కొందరు అన్నా డీఎంకే నుంచి డీఎంకేకు వచ్చి ఉండొచ్చని… కానీ తొలి నుంచి డీఎంకేలో ఉన్న వారు మాత్రం పార్టీ సిద్ధాంతాల గురించి ఆలోచించాలన్నారు. ఆ సిద్ధాంతాలను తాము అనుసరిస్తున్నామో లేదో చూసుకోవాలన్నారు. చాలా మంది దీని గురించి బయటకు మాట్లాడటానికి భయపడతారని… కానీ తనకు పోయేది ఏమీ లేదని… అందుకే తాను మాట్లాడుతున్నానని సెంథిల్ కుమార్ అన్నారు. ఇక ఎంపీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ దేవుళ్లను అవమానించిన ఎంపీపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three − two =