More

  జిహాదీల కోసం దీపావళి..! న్యూయార్క్‎లో నయా దందా..!!

  హృదయ విదారక సంఘటనలు వివరించి,.. మొసలి కన్నీరు కార్చేసి,.. బాధితులను ఆదుకోవడానికి స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని దుష్టగ్యాంగ్ డ్రామాలకు తెరతీసింది. హిందువుల పవిత్ర పండగ దీపావళిని.. తమ దుష్టక్రీడలో పావుగా చేసింది.

  న్యూయార్క్ బ్రూక్లిన్ బరోలో దీపావళి పార్టీ నిర్వహిస్తున్నారు. ది బెల్ హౌస్ లో ఈ పార్టీ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పాకిస్థాన్ వరదబాధితుల సహాయార్థం ఈవెంట్ నిర్వహిస్తున్నామని అని ప్రచారం చేశారు. అయితే, ఇక్కడ ట్విస్టేంటంటే.. పేరుకు వరద బాధితుల సహాయార్థం అని చెబుతున్నా.. పాకిస్థాన్ ఆధారిత జిహాదీ సంస్థకు నిధులు సమకూర్చడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. ఇప్పటికే టికెట్లు విక్రయించి భారీస్థాయిలో సోమ్ములు వసూలు చేశారు. ఈ ఆదాయాన్ని అల్ఖిద్మత్ ఫౌండేషన్ కు పంపిస్తున్నారు. ఇది రాడికల్ జమాత్-ఇ-ఇస్లామీకి చెందిన సంస్థ.

  బ్రూక్లిన్ బరోలో దీపావళి పార్టీ వివరాలను ది బెల్ హౌజ్ నుంచి దుష్టగ్యాంగ్ ట్వీట్ చేసింది. అల్ఖిద్మత్ ఫౌండేషన్‌కు వచ్చే ఆదాయం పాకిస్థాన్‎లో సహాయక చర్యల కోసం అని ట్వీట్ లో పేర్కొంది. ఆ ట్వీట్ వివరాలే ఇవి. ఆర్టీ గొల్లపూడి, మాయా దేశ్‎ముఖ్ దీపావళి పార్టీ అందిస్తున్నారు. కామెడీ ట్రూప్ అపర్ణ నాంచెర్ల, సునీతా మణి, ప్రోమా ఖోస్లా, పూజారెడ్డి, జుబీ అహ్మద్ అని సంగీతం DJ రేఖ, కార్డమామి అని.. ఉగ్రవాద సపోర్టింగ్ ఆర్టిస్టులందరి పేర్లు ఆ ట్వీట్ పాంప్లెట్‎లో తెలిపారు. ది బెల్‎హౌజ్‎లో అక్టోబర్ 23 ఆదివారం రాత్రి నిర్వహిస్తున్నట్టు, ప్రోగ్రామ్‎లో సాధారణ ప్రవేశం 19.72 డాలర్లు అని తెలిపారు. ఇంటర్నెట్‎లో ఈ పోస్టర్ హల్ చల్ చేసింది. అనంతరం, ఏ వివరణ లేకుండా బెల్ హౌస్ ట్వీట్ ను తొలగించింది. అయితే, టికెట్ విండో లింక్ మాత్రం అలాగే కనిపిస్తోంది.

  పాక్ ఇస్లామిస్ట్ రాజకీయ పార్టీ జమాత్-ఇ-ఇస్లామీకి చెందిన స్వచ్ఛంద సంస్థగా అల్ఖిద్మత్ ఫౌండేషన్ కార్యకలాపాలు సాగిస్తోంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో బెంగాలీలపై జరిగిన మారణహోమానికి ఈ సంస్థ బాధ్యత వహించింది. 2006లో ఇజ్రాయెల్, జేఐ యూదులకు వ్యతిరేకంగా తమ జిహాద్‌ను కొనసాగించడానికి ఉగ్రవాద సంస్థ హమాస్‌కు లక్ష డాలర్లు బదిలీ చేసిన నిజాలు వెల్లడయ్యాయి. ముస్లిం అమెరికన్ స్వచ్ఛంద సంస్థ ‘హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థతో కలిసి, ఇలా లోపయికారి వ్యవహారాలు ఎన్నో నిర్వహిస్తూ..సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విషయాలు వెల్లడవుతున్నాయి. ఎన్నో మీడియా సంస్థలు ఈ అసంబద్ధ కార్యక్రమాలను బహిర్గతం చేస్తున్నాయి.

  పాక్ లో దేవాలయాల నిర్మాణానికి పన్నుచెల్లింపు దారుల సొమ్ము వినియోగించాలనే చర్చ వచ్చినప్పుడు, జమాతే ఇస్లామీ చీఫ్ సిరాజ్-ఉల్-హక్ దీన్ని తిరస్కరించారు. ఉల్ హక్ తేల్చిన విషయం ఏమిటంటే, పాక్ లో పన్ను చెల్లింపుదారులు కేవలం ముస్లింలే అని తెలిపారు. ముస్లిం జనాభా అవసరాలకు వ్యతిరేకంగా డబ్బును ఉపయోగించలేమని హక్ చెప్పారు. గత ఏడాది సిరాజ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్థానీ హిందూ కార్యకర్త కపిల్ దేవ్ ట్విట్ చేశారు. సిరాజ్-ఉల్-హక్ మహాశయా.. ఈ దేశంలో ఐదు మిలియన్ల హిందు పన్ను చెల్లింపుదారులు ఉన్నారని కపిల్ తెలిపారు. ఎండోమెంట్ విభాగం మూతపడేలా ప్రవర్తించకండి. దేవాలయాలు, గురుద్వారాల అద్దెల నుంచి ఈ నిర్మాణాలు కొనసాగించాలని చెప్పారు.

  ఇస్లామిస్ట్ చారిటీ వింగ్ కోసం, కాని పనుల నిర్వహణ కోసం, హిందూ పండుగను ఉపయోగించుకోవడం హేయమైన చర్య అని హిందువులు అంటున్నారు. సహాయ కార్యక్రమాల ముసుగులో ఈవెంట్లు నిర్వహించి, ఆ సొమ్మును ఉగ్రవాద సంస్థలకు అందచేయడం దారుణమని మండిపడుతున్నారు.

  Trending Stories

  Related Stories