More

    దీపావళి సెలవుపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

    దీపావళి పండుగకు సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24న అంటే రాబోయే సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. దీపావళి సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విడుదల చేసిన సెలవుల జాబితాలో దీపావళి సెలవు తేదీని మారుస్తున్నట్టు తెలిపింది. అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీపావళికి సంబంధించి అందరిలో నెలకొన్న సందేహానికి కారణం ఏమిటంటే.. క్యాలెండర్లో ఈ నెల 25న అమావాస్య ఉండటమే. అదే రోజున దీపావళి అని చాలా మంది భావించారు. కానీ పంచాంగాల్లో మాత్రం 24వ తేదీనే అని ఉంది. దీపావళిని సూర్యాస్తమయ వేళల్లో నిర్వహిస్తారు. 25వ తేదీన తిథి అమావాస్య ఉన్నప్పటికీ, సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వస్తుంది. అదే 24వ తేదీన అయితే సాయంత్రం 4.25 గంటలకు అమాస్య ప్రారంభమై కొనసాగుతుంది. 24వ తేదీ సాయంత్రాన్నే అమావాస్యగా భావించాలని పురోహితులు తెలిపారు.

    Trending Stories

    Related Stories