More

    అమెరికన్ వర్శిటీల కేంద్రంగా కుట్రలకు పాల్పడుతున్న తుక్డే తుక్డే గ్యాంగులు

    తాలిబన్ల చేతిలోపడినా.., అఫ్గానిస్తాన్ నుంచి…, తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ దేశ ప్రజలు పలాయనం చేస్తున్న దశ్యాలు.., మనం గత వారం రోజులుగా చూస్తున్నాం.! ఇస్లామ్ మతోన్మాదం…, తాలిబన్ అనే ఉగ్రవాద రూపం దాల్చి… మొత్తం ప్రపంచ శాంతినే ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నది నిప్పులాంటి నిజం. అఫ్గానిస్తాన్ ప్రజల కన్నీటి గాథలు వింటుంటునే…, ఇస్లామ్ మతోన్మాద రక్కసి నైజమేంటో మనకు ఇంటో తెలిసిపోతుంది.!
    దీనికి పెద్దగా విశ్లేషించాల్సిన పనిలేదు. అలాగే ఇస్లామిక్ మతోన్మాదాన్ని., ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అర్థం చేసుకోవాలంటే.., బీఏలు, ఎంఏలు, పీజీలు, ఇంకా పీహెచ్ డీలు చేయాల్సిన అవసరం లేదు.
    అయితే జస్ట్ కామెన్స్ ఉంటే చాలూ..! ఇస్లామిక్ మతోన్మాదం అంతా అర్థమైపోతుంది.
    ఇంత క్లియర్ కట్ గా ప్రపంచ శాంతికి., ఇస్లామ్ ఉగ్రరూపంతో., ముప్పు వాటిల్లుతోందన్న విషయం.., తేటతెల్లం అవుతున్నా.., ఈ తుక్డే తుక్డే గ్యాంగులు.., హిందుత్వాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు!
    ఈ తుక్డే తుక్డే గ్యాంగులో అన్ పడ్ గాళ్లు ఉన్నారని అనుకోకండి. మార్క్సిస్టు మదర్సాల్లో బాగానే కమ్యూనిజాన్ని మతోన్మాదాన్ని బాగా తలకు ఎక్కించుకున్నోళ్లు..? వాళ్ల పేర్ల వెనుక బారేడు డిగ్రీలు కూడా ఉంటాయి.! ఇంకా వీళ్లందరికి మరోక పేరుంది. అది ఏంటో తెలుసా? బడా ఆలోచనపరులు, మేథావులు ఇంకా థింకర్లట..!
    అయితే వీరందరూ ఉండేది మాత్రం కమ్యూనిస్టు దేశంలో కాదు..! ఫక్తు కాఫ్టలిస్ట్ కంట్రీలో ఉంటూరు. లగ్జరీ లైఫ్ ను ఏంజాయ్ చేస్తుంటారు. మనకేమో సెక్యులిరిజం, లిబరలిజం, మానవ హక్కులు అంటూ లెక్చర్లు ధంచేస్తుంటారు.
    ఇస్లామిక్ ఉగ్రవాదంతోనే ఈ ప్రపంచానికి అసలు ముప్పుపొంచివుందని తెలిసినా…, ఈ లెఫ్ట్, లిబరల్ , కుహనా మేధావులకు, వామపక్ష భావజాల ప్రొఫెసర్లకు , రచయితలకు, ఎందుకు తలకెక్కడం లేదు?
    కళ్ల ముందు…, అఫ్గాన్ లోని తాలిబన్ భూతం …, భయానక దృశ్యాలు సజీవంగా కనిపిస్తున్నా కూడా., ఎందుకు వీరంతా హిందుధర్మంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు?
    మిత్రులారా?చూడండి.! తనదైన శాంతి సౌభ్రతృత్వంతో…, జీవనమూలాలతో విశ్వవ్యాప్తమవుతున్న హిందుత్వానికి వ్యతిరేకంగా.., అంతర్జాతీయంగా కుట్రలు జరుగుతున్నాయనేది వాస్తవం. అంతేకాదు తాజాగా కొంతమంది అయితే.., మొత్తం ప్రపంచం నుంచే హిందుత్వాన్ని తొలగించివేసేందుకు మేధోమదనం చేయబోతున్నారట.
    అమెరికాలోని యూనివర్శిటిల్లో ప్రొఫ్రెసర్ల మూసుగులో తిష్టవేసిన భారత వ్యతిరేక శక్తులు ఈ కుట్రల్లో కీలక పాత్రను పోషించేందుకు రెడీ అయ్యాయని తెలుస్తోంది. గతంలో ఇవే శక్తులు ప్రభు శ్రీరాముడిని, హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై కారుకూతలు కూసిన విసం మనం మర్చిపోరాదు.
    హిందుత్వంపై ద్వేషంతో … DISMANTLING GLOBAL HINDUTVA CONFERENCE పేరుతో వచ్చే నెల సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు 40కి పైగా విశ్వవిద్యాలయాలకు చెందిన 60 డిపార్ట్ మెంట్లు స్పాన్సర్ చేస్తున్నాయి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తున్నాయి.
    ఇక ఈ మూడు రోజుల సమావేశంలో ఆనంద్ పట్వర్ధన్, ఆయేషా కిద్వాయ్, భాను సుబ్రమణ్యం, భన్వర్ మేఘవంశీ, క్రిస్టోఫ్ జాఫ్రెలోట్ , కవితా కృష్ణన్ , మీనా కందస్వామి, మొహమ్మద్ జునైద్, నందిని సుందర్, నేహా దీక్షిత్ , పి.శివకామి వంటి వామపక్ష వక్తలు లెక్చర్లు ఇస్తారని చెబుతున్నారు.
    భారత్ లో హిందుత్వ ఉగ్రవాదం పెరిగిపోయిందని, దేశంలో మతపరమైన మైనారిటీలను, అట్టడుగు వర్గాలను భారత ప్రభుత్వం అణిచివేస్తోందని, అందులోనూ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇంకా ఎక్కువ అయ్యిందనేది వీరి ప్రధాన ఆరోపణ. అలాగే 2019లో మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన సీఏఏ చట్టం తీసుకుని వచ్చిందని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రదర్శనలను, ప్రభుత్వం కఠినంగా అణిచివేసిందని, మానవ హక్కులను ఉల్లంఘించిందని ఈ కాన్ఫరెన్స్ నిర్వహకులు ఆరోపించారు.
    అయితే ఒక్కటి మాత్రం.! ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే హిందువులందరూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మమేకమవుతూ…, సంఘటిత శక్తిగా మారుతుండటం ఈ కుహనవాదులకు మింగుడుపడటం లేదు. హిందువులు మతం పేరుతో ఏ దేశంపై దురాక్రమణలు జరపలేదు. అక్కడి ప్రజలను బలవంతంగా మాతం మార్చలేదు. మహిళల హక్కులను హరించలేదన్నది వాస్తవం. అయినా కూడా ఇస్లామ్ కంటే కూడా హిందుత్వమే ప్రమాదకరమంటూ దుష్ప్రచారం చేయడం వెనుక వీరి మోటివ్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి.
    హిందుత్వాన్ని అంతం చేయాలంటూ గోల చేసే వీరికి, ఇంకా సెక్యులరిజం అంటూ గొంతులు చించుకునే వారికి.., హిందువులపై జరుగుతున్న దారుణాలు ఎందుకు గుర్తుకురావడం లేదు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గుండాలు హిందువులపై జరిపిన దారుణాలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం.
    అటు అఫ్గాన్ ప్రజల ఆర్తనాదాలు కానీ, ఇటు బెంగాల్ ప్రజల ఊచకోతలు కానీ… ఈ సోకాల్డ్ లెఫ్ట్, లిబరల్ స్వయం ప్రకటిత మేధావులకు, రచయితలకు, ఎందుకు కనిపించడం లేదు. తాలిబన్లపై, అలాగే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గుండాగిరిపై కనీసం ట్విటర్ లో పోస్టు చేసే ధైర్యం కూడా వీరు చేయరు.! కానీ ప్రపంచ శాంతికి హిందుత్వంతో ప్రమాదం ఏర్పడిందని, హిందుత్వాన్ని కూల్చివేయండి అంటూ లెక్చర్లు ఇస్తారట.
    వరల్డ్ వైడ్ గా మతం మార్పిడి రాజకీయాలు చేసే క్రైస్తవ మిషనరీలపై కానీ, హింసాకాండతో అమాయక ప్రజల ప్రాణాలు తీసే మావోయిస్టులపైనా కానీ, అలాగే ఉగ్రవాద దాడులు జరిపే ఇస్లామిక్ మతోన్మాద మూకలపై కానీ, భాషావాదంతోపాటు, కుటుంబవారసత్వ రాజకీయాలు చేసే.., ప్రాంతీయవాద వేర్పాటువాద శక్తులపై కానీ ఎలాంటి కాన్ఫరెన్స్ లు ఉండవు.
    భారతీయులారా ఇప్పటికైనా అర్థమవుతుందా? జాగృతం కండి. జాతీయవాద జర్నలిజాన్ని పోత్సహిచండి. DISMANTLING GLOBAL HINDUTVA CONFERENCE నిర్వహకులపై మీదైనా కామెంట్లతో తిప్పికొంటండి. మనసా వాచా కర్మణా దేశహితం కోసం పాటుపడండి.
    భారత్ మాతాకీ జై.

    Related Stories