దర్శకేంద్రుడి పొలిటికల్ కామెంట్స్

0
889

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పొలిటికల్ జర్నీ చూస్తే.. తెలుగు దేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నట్లే..! నందమూరి తారకరామారావు టీడీపీని ప్రారంభించినప్పటి నుండి ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే ఆయన కొన్ని అంశాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కాస్త దూరంగానే ఉంటారు. చాలా రోజుల తర్వాత ఆయన పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఇంకొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో మరో రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కె.రాఘవేంద్రరావు జోస్యం చెప్పారు. ప్రజల్లో రోజురోజుకు పార్టీపై ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.

బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్రరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నాయకులు నడవాలన్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.