More

    పులివెందుల కాల్పుల్లో ఒకరు మృతి.. ఆ తుపాకీ భరత్ కు ఎక్కడిదంటే..?

    పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో దిలీప్ మృతి చెందాడు. దిలీప్ కు ఛాతీలో, తలపైనా బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి, దిలీప్ కు ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో పులివెందుల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గొడవ జరిగింది. భరత్ కుమార్ ఐదు రౌండ్లు కాల్పులు జరపగా దిలీప్, మస్తాన్ బాషా గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దిలీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వేంపల్లె వద్ద మృతి చెందాడు. భరత్ కుమార్ యాదవ్ ఈ ఘటనలో లైసెన్స్డ్ గన్ ఉపయోగించినట్టు తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories