నిజాం కోసం.. పటేల్‎పై నెహ్రూ రంకెలు..! నాటి ఐఏఎస్ ఏం చెప్పారంటే..?!

0
825

తమ సామర్థ్యాన్ని స్వార్థానికి వినియోగించాలనే భావన మదిలో మెదిలినప్పుడు.. సహచరులు, అనుచరులు చేసే మంచి సలహాలు వారికి ఎలా రుచిస్తాయి. నిండుకుండ తొణకని మాదిరిగా వుండే అసలు, సిసలు సామర్థ్యసంపన్నులు, ధీరోదాత్తులు. వారి కంటికి అల్పుల్లా కాక సర్వోన్నతుల్లా ఎందుకు కనిపిస్తారు. అహంభావం పొగమంచులా ఆవరించివున్నప్పుడు.. ఎదుటి మనిషిలోని విజ్ఞానం, వివేకం, ఆప్యాయత, అనురాగాలు ఎందుకు కనిపిస్తాయి. ఈ తరహా వ్యక్తులకు అపర దేశభక్తులు, శిఖర సమాన వ్యక్తులు.. మరుగుజ్జుల్లా కనిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ వుండదు.

వక్రీకరణకు గురైన వాస్తవాలు చరిత్ర పుటల్లోకి ఎక్కి.. అవే అద్భుత నిజాలుగా చెలామణి అయిపోతుంటే.. ఎవరు మాత్రం వాటిని ఖండించగలరు. వక్రబుద్ధి వక్రీకరణలు కాలానుక్రమంలో బలవర్థకరంగా మారి.. అవే ఆదర్శనీయంగా మారిపోతుంటే.. కాదని ఖండించే వారు ఎవరు వుంటారు. చరిత్రలో వక్రీకరణకు గురైన చేదు నిజాలను ఎవరైనా బహిరంగపర్చదలిస్తే.. వక్రీకరణ హీరోలకు ఆ నిజాయతీ వ్యక్తులంటే ఆగ్రహావేశాలు రాకుండా వుంటాయా..?

వందనాన్ని స్వీకరించిన జాతీయ జెండా ఏమని ఆశీర్వదిస్తుంది..? అందరూ తన అంత ఎత్తు ఎదగాలని పుష్పాలు వెదజల్లి ఆశీర్వాదాలు అందిస్తుంది. జాతీయ జెండా అడుగుజాడల్లో నడిచే అపర దేశభక్తులు ఏం చేస్తారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. దురాగతాలతో బీభత్సం సృష్టించి ప్రజా కంఠకులుగా మారే దుష్టశక్తులను తరిమికొడతాం అని చెబుతారు. పైకి ప్రజలపై ప్రేమ ఒలకబోసి, వంచకులకు పరోక్ష వత్తాసు పలికే నాయక గ్యాంగ్ లను గురించి ఏమనుకోవాలి. అసలు సిసలు శిఖర సమాన వ్యక్తులను అణగదొక్కి.. ఆ శిఖర సమానతను, తమ పేటెంట్ రైట్స్ గా భావించే వ్యక్తుల గో ముఖ వ్యాఘ్ర మనస్థత్వాన్ని తెలుసుకుంటే..ఎవరికైనా ఏమనిపిస్తుంది. కడుపు రగిలిపోతుంది. ఔరా.. ఇంత దారుణమా అనిపిస్తుంది.

శిఖర సమాన వ్యక్తిత్వమంటే ఏమిటో తెలుసుకోవాలంటే.. అది ఒక రూపు దిద్దుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ సబ్జెక్ట్ లోకి ఎంటరవ్వాల్సిందే. క్యాబినెట్ మీటింగ్ లో తన సీనియర్ సహచరుడిని తొలి ప్రధాని నెహ్రూ ఎలా అవమానించారో తెలుసుకుంటే కడుపు రగిలిపోతుంది. ఫ్యూడల్ భావజాలపు ప్రతినిధి నెహ్రూ.. శిఖర సమాన వ్యక్తిత్వం ఉన్న సర్దార్ పటేల్ ముందు నిజంగా మరుగుజ్జే. హైదరాబాద్ సంస్థానపు విలీన ప్రస్తావన వచ్చినప్పుడు నెహ్రూ సర్దార్ పటేల్ మీద క్యాబినెట్ మీటింగ్ లోనే రంకెలేసిన విషయాన్ని 1947 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎం.కె.కె. నాయర్ తన పుస్తకంలో రాసుకొచ్చారు..!

నాడు నిజాం రాజు ప్రైవేట్ సైన్యం రజాకార్ల రూపంలో భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో జరిగిన ఆ క్యాబినెట్ సమావేశంలో తానసలు పటేల్ ప్రతిపాదనలు వినదలచుకోలేదంటూ నెహ్రూ ఒంటెత్తు పోకడ పోయిన విషయాన్ని నాయర్ సోదాహరణంగా వివరించారు. నెహ్రూ చేసిన అవమానంతో ఆ సమావేశం నుంచి సర్దార్ పటేల్ నిష్క్రమించినట్టు నాయర్ రాశారు. ఈ సమావేశం తరువాత నెహ్రూతో ఆయన ఏనాడు పన్నెత్తి మాట్లాడ లేదు. కన్నెత్తి చూడలేదు. 1950లో మృతి చెందేవరకు ఆయన అదే పంథాను అనుసరించారు.

నెహ్రూ, పటేల్‌ను శత్రువుగా చూసేందుకు అభిప్రాయ భేదాలు కారణమయ్యాయనే విషయం పైకి వెల్లడైనా.. అసలు విషయాలను నాయర్ పుస్తకం వెల్లడించింది. సర్దార్ మరణించినప్పుడు నెహ్రూ అసలు రంగు బయటపడిందని నాయర్ పుస్తకంలో రాసుకున్నారు. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‎ను సర్దార్ అంత్యక్రియలకు హాజరు కావద్దని శాంతిదూత, ఉచిత సలహా పారేశారట. దానికి రాజేంద్ర ప్రసాద్ గట్టిగానే క్లాస్ ఇచ్చారని, సంకుచిత మనస్థత్వం కూడదని చెప్పారని నాయర్ తన పుస్తకంలో రాసుకున్నారు.

బాబూ రాజేంద్ర ప్రసాద్ మాటలకు మింగలేని, కక్కలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడిన నాటి మహానేత.. సర్దార్ పటేల్ అంత్యక్రియలకు హాజరుకావాలనుకున్న అధికారులందరూ సొంత ఖర్చులతోనే అటెండ్ అవ్వాలని ప్రత్యేక నోట్ పంపారట. అయితే, అప్పటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.పి.మీనన్ తన సొంత ఖర్చులతో అధికారులను విమానంలో పంపారు. ఈ ఘటనతో మీనన్ సైతం ఆకాశం అంత కీర్తి ఘడించగా, మరుగుజ్జు వ్యక్తిత్వానికి తార్కాణంగా నిలిచిన మన మహానేత అధ:పాతాళ కీర్తి ఘడించారని..నాటి జనాలు వ్యాఖ్యానించుకున్నట్టు ఈ పుటల్లో దర్శనమిచ్చినట్టు తెలిసింది.

మేప్పల్లి కేశవ పిళ్లై కృష్ణన్ నాయర్.. M K K నాయర్ పూర్తి పేరు. ‘స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టెడ్ విట్ విల్’ రచయిత నాయర్, తన 25 ఏళ్ల కెరీర్ లో బ్యూరోక్రసీ, పారిశ్రామిక, కళారంగాల్లో తమదైన ముద్ర వేశారు. 1980 దశాబ్ద మధ్యకాలంలో..మళయాళ వారపత్రికలో తొలిసారిగా.. M K K నాయర్ ఆత్మకథ ధారావాహికంగా ప్రచురించబడింది. 1987లో, నాయర్ 66 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మృతి చెందినప్పుడు సైతం..వారపత్రికలో ఆయన ఆత్మకథ నడుస్తూనే ఉంది. మరణం సమీపంలో వుందని గ్రహించి ఈ పుస్తకంలోని చివరి అధ్యాయాలను M K K నాయర్ పరిశోధించారని గోపకుమార్ ఎం నాయర్ తెలిపారు. ఆయన ఈ గ్రంథ అనువాద కర్త.

కొల్లంకు చెందిన నాయర్ 1941లో డివిజనల్ అకౌంటెంట్, టెలిఫోన్ మేనేజర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. రెండు సంవత్సరాల అనంతరం, ఆయన సికింద్రాబాద్‌ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్లానింగ్, కోఆర్డినేషన్ ఆఫీసర్‌గా చేరారు. ఈ సమయంలో పటేల్‌కు మరింత దగ్గరయ్యారు. నిజాం సైన్యాన్ని బలోపేతం చేసే కుట్ర గురించి పటేల్‌కు ఎలా తెలియజేసింది, నాయర్ రచనల్లో కనిపిస్తాయి.

నిజాం ప్రభుత్వ ఉన్నతాధికారులకు నిలయంగా నాయర్ గృహం మారడంతో..వారి చర్చల నుంచి ఆయన చాలా విషయాలు గ్రహించాడు. ఆందోళనకర విషయాలను పటేల్ కు తెలియజేసినా, తొలుత ఆయన వాటిని సామాన్య విషయాలుగా భావించారు. అయితే, నాయర్ హెచ్చరికలు కొన్ని నిజం కావడంతో పటేల్ అప్రమత్తం అయ్యారు. నాయర్ ఢిల్లీలో పటేల్‌ను కలవడానికి వెళ్లినప్పుడు..తన సందేశాలు నేరుగా ఆయనకే వినిపిస్తానని పటేల్ కార్యదర్శికి చెప్పినట్టు తెలిసింది. నెహ్రూ-పటేల్ మధ్య సంబంధాలు, 1948 సంవత్సరం మధ్యకాలంలో ఏం జరిగిందనే విషయం గురించి తాను కొంత గ్రహించానని, పౌర సేవకులు V P మీనన్ నుంచి కొంత తెలుసుకున్నానని పుస్తకంలో వివరించినట్టు వెల్లడైంది.

పటేల్ ను నెహ్రూ శత్రువులా చూడడానికి కారణం అభిప్రాయబేధాలు కారణం ఒక్కటే కాదని, వ్యక్తిగత ద్వేషానికి నెహ్రూ అతీతులేం కాదని నాయర్ బుక్ లో తెలిపారు. పటేల్ మృతి చెందిన రోజు, హోం మంత్రిత్వ శాఖకు నెహ్రూ రెండు మెమోలు పంపారు. అనంతరం వి.పి మీనన్ ను కలిశారు. ఈ రెండు మెమోల్లో మొదటిది..పటేల్ ఉపయోగించిన కాడిలాక్ కారును వెంటనే విదేశాంగ మంత్రిత్వశాఖకు ఇవ్వమని ఒక ఆదేశం, రెండో ఆదేశం ..పటేల్ అంత్యక్రియలకు హాజరయ్యే అధికారులు స్వంత ఖర్చులతో వెళ్లాలనే సూచన. పటేల్ నాటి బొంబాయిలో మరణించడంతో.. అధికారులు అక్కడకు ప్రయాణించాల్సిన అవసరం వచ్చింది.

నెహ్రూ ఉత్తర్వులను విపి మీనన్ బేఖాతరు చేసి తన సొంత ఖర్చులతో అధికారులను బొంబాయికి పంపారని నాయర్ ఆత్మకథలో రాశారు. నెహ్రూ ఉత్తర్వులు వెల్లడించకుండా, పటేల్ అంత్యక్రియలకు వెళ్లాలనుకునే వారి పేర్లు చెప్పండని మీనన్ కోరగా, దాదాపు డజను మంది.. తాము పటేల్ అంత్యక్రియలకు వెళతామని చెప్పారు. వీరిని, తన స్వంత ఖర్చులతో మీనన్ బొంబాయికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న నెహ్రూ మరింత చిరాకు పడి, మీనన్ పై నిప్పులు చెరిగారని..బుక్ లో రాశారు.

తెల్లనివన్ని పాలు నల్లనివన్నీ నీళ్లు కావని…పైకి నీతి..లోపల రోత వుండే నేతలు ఎందరో వున్నా.. స్వాతంత్ర్య సముపార్జనలో కీలక నేతలుగా చెప్పుకుని..దేశ అత్యున్న పదవిని చేపట్టిన వ్యక్తి..ఈ రీతిలో వ్యవహరించారు అంటే..ఎవ్వరికీ నమ్మబుద్ది కాదు. అయినా..ఇది చేదు నిజం. ఇలా చరిత్ర కందని సత్యాలు…మొగలాయిలు, ఆంగ్లేయుల కాలంలోనూ ఎన్నో వున్నాయి. చరిత్రలో మొగలాయిల గురించి గొప్పగా కనిపించినా..చరిత్ర పుటలకు దూరంగా వున్న మొగలాయిల అసలు సిసలు చరిత్ర చూస్తే..ఒళ్లు గగుర్పాటు వస్తుంది. ఇక ఆంగ్లేయుల అరాచక పాలనకు అంతే లేని విషయం అందరికీ తెలిసింది. మెకాలే విద్యలు, దౌర్భాగ్యపు కల్చర్ లు..మన నెత్తిన బలవంతంగా రుద్దినే లార్డ్ లు ఆంగ్లేయులే.

మహత్తర మార్తాండ దేవాలయ నిర్మాత..హైందవ జాతి కోసం అహర్నిశలు శ్రమించిన లలితాదిత్యుడు, రాయ్ గడ్, సింహగడ్, పురంధర్ కోటల బీటలు బద్దలు కొట్టి..ఔరంగజేబ్ కు ముచ్చెమటలు పట్టించిన మరాఠా యోధుడు, దేశభక్తుడు, జై భవాని నినాదాన్నిచ్చిన దైవభక్తుడు..ఛత్రపతి శివాజీ, రాణా సంగ్రామ్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి గురించి…నామ మత్రంగా చరిత్రలో చేర్చారంటే..ఎన్నెన్ని చరిత్రకందని సత్యాలు వున్నాయో గ్రహించవచ్చు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × 2 =