కరోనా వైరస్ జీవాయుధమా..?

0
806

కరోనా పుట్టినిల్లు ఏదంటే చైనా పేరే వినిపిస్తుంది. వినిపించడమే కాదు.. అదే నిజమమని నిరూపించేందుకు ఆధారాలు కోకొల్లలు. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ ను కావాలనే తయారు చేశారని ఇప్పటికే ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. ఎందరో శాస్త్రవేత్తలు, చైనాకే కెందిన కొందరు వైద్య నిపుణులు ఇదే మాట చెప్పారు. వారంతా ఆ తర్వాత జిన్ పింగ్ సర్కార్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ఎందరో జర్నలిస్టులు కూడా ఆచూకీ లేకుండాపోయారు. అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కొందరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో చైనా తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగానే వుంది. కేసుల లెక్కలు, మరణాల గణాంకాలు ఇంతవరకు ప్రపంచానికి చూపించలేదు సరికదా.. అక్కడ కరోనా రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారనేది కూడా ఎవరికీ తెలియదు.

తాజాగా, అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్టు కూడా.. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందనడానికి సాక్ష్యాలను బయటపెట్టింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఎంతో మంది పరిశోధకులు కరోనా లక్షణాలతో నవంబర్ 2019లో ఆసుపత్రుల పాలయ్యారట..! కానీ, ఇలాంటివి ఎన్ని నిజాలు బయటికొచ్చినా.. చైనా ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టలేదని.. అది సముద్ర జంతువుల మార్కెట్లో పుట్టిందని మొదటి నుంచి వితండవాదం చేస్తూనేవుంది. అయితే ల్యాబ్ లో పని చేస్తున్న వాళ్లు మొదటగా కరోనా బారిన పడ్డారనే విషయం బయటకు రావడంతో.. తప్పకుండా చైనా ల్యాబ్ లోనే వైరస్ తయారైందని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నారు. నిజానికి, ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే ఆయన అడ్మినిస్ట్రేషన్.. 2019లో వుహాన్ ల్యాబ్ లో పని చేసే కొందరు కరోనా బారిన పడ్డారని తెలిపారు. అయితే ఆసుపత్రి పాలైన విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టులు బయటకు రావడం.. రీసర్చ్ చేస్తున్న వాళ్లు ఆసుపత్రి పాలయ్యారని చెప్పడం వంటివి చూస్తుంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోంది.

అమెరికా ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగానే.. ఇటీవల ప్రముఖ ఆంగ్ల పత్రిక వాల్ స్ట్రీట్ జనరల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ లో పుట్టిందనడానికి సాక్ష్యాధారాలను వివరించింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫాక్ట్‌ షీట్‌లోని కొన్ని విషయాలు బయటపెట్టింది. ఆ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. సాధారణ ప్రజలలో కరోనా సోకి ఆసుపత్రి పాలైన మొదటి రిపోర్టు డిసెంబర్ 8, 2019న వుహాన్ లో నమోదైనట్టు వుంది. అంటే, అంతకు ముందే కరోనా లక్షణాలతో వుహాన్ ల్యాబ్ లో పని చేసే శాస్త్రవేత్తలు బయటకు వచ్చారన్నమాట..! ఇదే విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ఎంతో మంది చైనా వైరాలజిస్టులు, వైద్య నిపుణులు ప్రయత్నించారు. కానీ, నిరంకుశ కమ్యూనిస్టు ప్రభుత్వం వారిని రాచిరంపాన తీరును మనం చూశాం. ఓవైపు ఇన్ని సాక్ష్యాధారాలు వెలుగుచూస్తున్నా.. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం బయటకు ఇవ్వడం లేదు.

ఇదంతా ఒకెత్తయితే, దీనికంటే భయంకరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు 2015లోనే కరోనా వైరస్ ను బయోవార్ లో భాగంగానే కమ్యూనిస్టు కంట్రీ చైనా కరోనా వైరస్ ను సృష్టించినట్టు.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ రీసెర్చ్ పేపర్ ఆధారాలతో సహా బయటపెట్టింది. కరోనా వైరస్ 2019 డిసెంబర్ లో బయటికి వచ్చినట్టు ప్రపంచం నమ్ముతోంది. కానీ, అంతకు నాలుగేళ్ల ముందే ఈ వైరస్ వెలుగుచూసినట్టు ఈ రీసెర్చ్ పేపర్ చెబుతోంది. కరోనా వైరస్ ను బయోలాజికల్ వెపన్ గా ఉపయోగించి.. ప్రపంచ నెంబర్ వన్ గా ఎదగాలన్న చైనా కుట్రను రీసెర్చ్ పేపర్ బట్టబయలు చేసింది.

2015లో చైనా శాస్త్రవేత్తలు, పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వైద్యాధికారులు కలిసి ఓ రీసెర్చ్ పేపర్ తయారు చేశారు. దాని పేరు ‘The Unnatural Origin of SARS and New Species of Man-Made Viruses as Genetic Bio-weapons’. దీనినిబట్టి మీకు ఇప్పటికే అర్థమై వుంటుంది జిత్తులమారి డ్రాగన్ ఎంత కుట్ర చేసిందో. అంటే 2019లో తొలి కరోనా వైరస్ కేసు వెలుగుచూడటానికి నాలుగేళ్ల ముందే ఈ కన్నింగ్ పనికి చైనా తెరతీసిందన్నమాట. అంతేకాదు, కరోనా వైరస్ జీవ ఆయుధాల యొక్క కొత్త శకానికి దారితీస్తుందని చైనా శాస్త్రవేత్తలు రీసెర్చ్ పేపర్‎లో రాసుకున్నారు. వైరస్‎లో మార్పులు జరిగితే, అది మానవులలో పెద్ద ఎత్తున వ్యాధిని వ్యాపిస్తుందని పేర్కొన్నారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. అలా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తే.. దానిని నియంత్రించడం చాలా కష్టమని కూడా రాశారు. 2015 లో చైనా శాస్త్రవేత్తలు అనుకున్నట్లే, కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

జీవాయుధాల ఆధారంగానే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని.. చైనా శాస్త్రవేత్తలు భావించారట. ఎందుకంటే, మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో రసాయన, అణ్వాయుధాలను ఉపయోగించారు. అయితే, వాటిని కూడా అడ్డుకోవడానికి ఇప్పుడు పెద్ద దేశాలన్నీ ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. దీంతో ఇతర దేశాలతో పోటీపడాలంటే రసాయన, అణ్వాయుధాల కంటే బలమైన ఆయుధాన్ని తయారుచేసుకోవాలని చైనా భావించింది. అలా జరగాలంటే వైరస్ ను జీవాయుధంగా మలుచుకోవడం ఒక్కటే మార్గమని ఈ కుట్రకు తెరతీసిట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ప్రపంచంలోని ఏ దేశం వద్ద కూడా వైరస్ ను నివారించగలిగిన సాంకేతిక పరిజ్ఙానం లేదు. ఈ పరిశోధనా పత్రంలో ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే.. చాలాకాలం మనుగడలో వుండే ఈ కరోనా వైరస్ ను యుద్ధంలో ఉపయోగించవచ్చని కూడా ఆరేళ్ల క్రితమే చైనా భావించిందట.

ఈ కథనాన్ని ప్రచురించిన ఆస్ట్రేలియా ప్రత్రిక మరో విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ రీసెర్చ్ పేపర్ తాము చెప్పిన నవిషయాలు.. అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల వద్ద కూడా వున్నాయని తెలిపింది. అంతేకాదు, వాటని ఇతర దేశాలతో పంచుకున్నాయని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు చైనా చేపట్టిన భయంకర రీసెర్చ్ మొత్తం ప్రపంచానికే తెలిసిపోయిందని చెప్పింది. అందుకే, తన గుట్టవుతుందన్న ఉద్దేశంతోనే.. కరోనా వైరస్ విషయంలో చైనా గోప్యత ప్రదర్శిస్తూ వస్తోంది. వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆలస్యంగా చెప్పడమే కాకుండా,.. వైరస్ పై పరిశోధన చేసేందుకు ప్రయత్నించిన WHO కు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. సరే, చైనా చెబుతున్నట్టు.. కాసేపు కరోనా వైరస్ సముద్ర జీవుల మార్కెట్లోనే పుట్టిందని అనుకుందాం. ప్రయోగశాల నుండి మానవులకు వ్యాపించలేదనే అనుకుందాం. మరి, వైరస్ పై దర్యాప్తునకు చైనా ఎందుకు అంగీకరించడం లేదు..? దీనినిబట్టి ‘కరోనా వైరస్ మేడి ఇన్ చైనా’ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మొత్తానికి, అమెరికా, ఆస్ట్రేలియా ఇంటలిజెన్స్ పరిశోధనతో చైనా కుతంత్రం మొత్తం బయటపడింది. సో.. చైనా సైంటిస్టులు, చైనా ఆర్మీ అధికారులు కరోనాపై తయారు చేసిన రీసెర్చ్ పేపర్ నిజమైనప్పుడు.. కరోనా వైరస్ ద్వారా ఇప్పటికేమరణించిన 30 లక్షలకు పైగా అమాయక ప్రజలు.. హత్యకు గురైనట్టే లెక్క. ఆ హత్యలకు చైనాయే కారణమని చెప్పడంలో తప్పులేదు. భారత్ లో భాయాందోళనలు రేకెత్తిస్తున్న సెకండ్ వేవ్ పుణ్యం కూడా చైనాదే అని చెప్పడమూ అతిశయోక్తి కాదు.

ఇక్కడ మనం ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. కరోనా మొదటి వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు, 60కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు అందించి.. అంతర్జాయంగా మంచి గుర్తింపు సాధించింది. కానీ, ఎప్పుడైతే, సెకండ్ వేవ్ మొదలైందో ఆ క్రెడిట్ అంతా చైనా కొట్టేసేందుకు రెడీ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి మన సరిహద్దు దేశాలకు సైతం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది. అంటే, ఈ వ్యాక్సిన్ మైత్రి ద్వారా.. తమది కరోనా పుట్టినిల్లు అన్న విషయం ప్రపంచం మర్చిపోతుందని చైనా భావిస్తోంది. అంతేకాదు, కరోనా మూలాలపై జరుగుతున్న పరిశోధనలు, వెలువడుతున్న పుస్తకాల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమంతా. ఆ పుస్తకాల్లో అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్టులు, ఆస్ట్రేలియా పరిశోధనలు అన్నీ ప్రచురితమవుతాయి. 2015లోనే కరోనా వైరస్ ను బయో వెపన్‎గా వాడాలనుకున్న చైనా కుటిల బుద్ధి కూడా ఆ పుస్తకాల్లో అచ్చవుతుంది. సో.. జిత్తులమారి డ్రాగన్..! నీ కుటిల బుద్ధిని కప్పిపుచ్చుకోవడానికి ఇక, ఎలాంటి అవకాశం లేదు. ఇప్పడంతా బహిర్గతమే. ప్రపంచ దేశాల ముందు నువ్వు దోషిగా నిలబడే రోజు దగ్గర్లోనే వుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here