ఇంటిపై దాడి చేసి.. మా అమ్మను బెదిరించారు: ఎంపీ ధర్మపురి అర్వింద్

0
666

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని.. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని అన్నారు ధర్మపురి అర్వింద్. తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ పీఎంఓ, ప్రధాని నరేంద్రమోదీలను ట్యాగ్ చేశారు ధర్మపురి అర్వింద్.

ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారంటూ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు.. నేడు ఆయన నివాసం వద్ద విధ్వంసం సృష్టించారు. ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు ఇంట్లోకి దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రస్తుతం ఎంపీ అర్వింద్ నిజామాబాద్లో ఉన్నారు.