More

    ఎవరి ఖాతా నుంచి డబ్బులు డ్రా అయ్యాయో తెలుసుకుంటే చాలా బెటర్: ఎంపీ ధర్మపురి అర్వింద్

    మొయినాబాద్ ఫాంహౌజ్‌ వ్యవహారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. అయ్యా.. కొడుకులిద్దరూ.. రాత్రి 10 కాగానే మందు కొట్టినట్టున్నారు. ఒక పనికిమాలిన ఆలోచన వచ్చి ఉంటుంది. అందుకే దీనికి ప్లాన్ చేశారని విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు కోసం వందల కోట్లు ఖర్చు పెడ్తున్నారంటున్నారని, అసలు వచ్చే ఎన్నికల్లో ఈ నలుగురిలో ఒక్కరైనా గెలుస్తారా? అని అర్వింద్ ప్రశ్నించారు. వీళ్ల కోసం వంద రూపాయలు కూడా దండగే అని అన్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్‌లో బీజేపీ ప్రలోభ పెడుతోందంటున్నారని, మరి ఎమ్మెల్యేలు ప్రలోభ పడటానికే వచ్చారా? అని ఆయన ప్రశ్నలవర్షం కురిపించారు. ఫాంహౌజ్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు పోలీసులకు ఫోన్ చేయడం, న్యూస్ చానళ్ల కెమెరాలు వారికంటే ముందే వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు రావడం చాలా విచిత్రంగా ఉందని అన్నారు. తొలుత వంద కోట్లన్నారని, ఇప్పుడు రూ.15 కోట్లు చెబుతున్నారని, కనీసం ఒక్క కోటి కూడా దొరికినట్లు అయినా ఇప్పటి వరకు పోలీసులు ప్రూవ్ చేయలేకపోయారని అర్వింద్ చెప్పారు. పోలీసులు మొత్తం డబ్బులన్నీ బయటకు తీయాలని, దానిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఆ పైసలు ఎవరి ఖాతా నుంచి డ్రా అయ్యాయో కూడా తీయాలని, అప్పుడు ఎవరు చేశారనేది బయటపడుతుందన్నారు. మందు కొట్టగానే వచ్చిన పనికిమాలిన ఆలోచన కూడా బెడిసికొట్టిందని ఎద్దేవాచేశారు. ఇదొక సిల్లీ ఆపరేషన్ అని విమర్శించారు. దీనికి డబ్బా కొట్టేందుకు కొన్ని చానళ్లు ఉన్నాయని ఫైరయ్యారు. దీనికంటే పనికిమాలిన చెత్త కహాని మరోటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories