Telugu States

ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై దాడి

బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి గ్రామంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ గూండాలే ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపించారు బీజేపీ నేతలు. ఈ ఘటనను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు.

Related Articles

Back to top button