More

    రాజీనామాకు సిద్ధమే: మంత్రి ధర్మాన ప్రసాదరావు

    విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకైనా సిద్ధమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కోసం ఉద్యమం అవసరం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు అంటే ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మొక్కుకుని వెళ్తే మాకు అభ్యంతరం లేదని.. ఈ గడ్డ మీదికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు.

    అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర పై మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మా పీక కోసేటందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్రగా వస్తున్నారా?.. మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని.. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలని అన్నారు ధర్మాన ప్రసాదరావు.

    Trending Stories

    Related Stories