కాకినాడ జిల్లా: పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. ప్లాన్ ప్రకారమే ఇద్దరూ కలిశారన్నారు. మంగళవారం తునిలో మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్.జగన్ సుపరిపాలనతో ప్రజలు టీడీపీని మర్చిపోయారన్నారు. టీడీపీకి బలం లేకే దత్తపుత్రుడిని కలుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలనని ఎదుర్కొలేకే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య ఘర్షణలు రేపుతున్నారని ఆరోపించారు.