National

డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు.. మరో సారి టెన్షన్ పెడుతున్న మహారాష్ట్ర

కరోనా సెకండ్ వేవ్ సమయంలో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే..! ఇక ఇటీవలే కరోనా కేసులు తగ్గడంతో లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. అయితే మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. సోమవారం 6,270 కేసులు నమోదవ్వగా.. మంగళవారం నాడు 8,470కి పెరిగాయి. బుధవారం నాటికి 10,066కి చేరుకున్నాయి. దీంతో మరోసారి రాష్ట్ర యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. అన్‌లాక్‌ పేరిట నిబంధనలు సడలిస్తే భారీ స్థాయిలో కేసులు విజృంభించే అవకాశం ఉందని సీఎం ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని కమిటీ ఇటీవలే హెచ్చరించింది. అయినా కూడా ప్రజలు పలు ప్రాంతాల్లో నిబంధనలను పాటించడమే లేదు. కోవిడ్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. డెల్టా కొత్త వేరియంట్ కూడా దేశంలో కనిపించడంతో ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది.

కొత్త మ్యుటేషన్ దేశంలో వైరస్ రెండో వేవ్ కు కారణమవ్వగా.. డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పటి వరకు కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని రత్నగిరి, జల్గావ్ ప్రాంతాలల కనిపించింది. దీంతో తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. మహారాష్ట్రలో మూడవ వేవ్ ఊహించిన దానికంటే ముందే రావచ్చని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

కరోనా సెకండ్ వేవ్‌లో మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారింది. ఇది ఇప్పటి వరకూ ఉన్నవాటి కంటే చాలా రెట్లు ప్రమాదకరమని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతూ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 5 డెల్టా ప్లస్ వేరియంట్కే సులు నమోదయ్యాయి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్నారు. వ్సాక్సిన్ తీసుకోని మహిళ మాత్రం మృతి చెందింది. మృతురాలి నుంచి తీసుకున్న నమూనా జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా డెల్టా ప్లస్ వేరియంట్‌తోనే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

మహారాష్ట్రలో ఇప్పటికే 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నాయి. దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్ 6, కేరళ 3, తమిళనాడు 3, కర్ణాటక 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలలో ఒక్కొక్క కేసు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × one =

Back to top button