More

  ‘తుస్సు’మన్న కేజ్రీవాల్‎ క్రాకర్స్ బ్యాన్..! టపాసులతో మార్మోగిన ఢిల్లీ..!!

  లెనిన్, స్టాలిన్ లాంటి నియంతలే.. నిర్భంధంతో విజయం సాధించలేకపోయారు. పిల్లి అయినా గదిలో బంధిస్తే పులిలా తిరగబడుతుంది. అటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలపై నిర్భంధాలు విధిస్తే.. అది తామరాకు మీద నీటిబొట్టులానే మిగిలిపోతుందని పాలకులు గ్రహించాలి. అది కూడా ఏవో విధి విధానాలపై నిర్భంధిస్తే కాస్తంత లాభముంటుందేమో.. కానీ, మతపరమైన మనోభావాలపై, అదీ ఒక్క రోజు జరుపుకునే వేడుకలపై నిర్భంధం విధిస్తే ఎంతమాత్రం నిలవలేదు. ఇదే విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‎కు బాగా బోధపడింది.

  దీపావళి రోజున బాణసంచాపై నిషేధం విధిస్తూ.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం బూడిదలో పోసిన పన్నీరైంది. దీపావళి రాగానే కాలుష్యం అంటూ కుహనా లౌకిక మీడియా సంస్థలు గగ్గోలు పెట్టడం.. అందుకు కేజ్రీవాల్ బాకా ఊదడం పరిపాటిగా మారిపోయింది. నిజానికి, ఢిల్లీలో సరిగ్గా దీపావళి ముందు రెండురోజుల నుంచి మొదలైన కాలుష్యం దీపావళి మరుసటిరోజు వరకు ఉండి తర్వాతి రోజు మటుమాయమైపోతుంది. దీపావళి రాగానే ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగి ప్రజలకు ఊపిరి కూడా ఆడటంలేదని పత్రికలు పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వారుస్తాయి. ఇక ఒక్క అగరబత్తి వెలిగించినా వచ్చే పొగకు వందలాది మంది చనిపోతారేమో అన్నంతగా మీడియా సంస్థలు ఊదరగొడతాయి. ఇక తన ప్రజల ప్రాణాలను కాపాడటానికి తన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని ఏమీ చేయలేక హిందూ పండుగలపై నిషేధం విధించాడు. ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా ఉండటంతో గ్రీన్ క్రాకర్స్ తో పాటు అన్నిరకాల బాణాసంచాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. నిబంధనలను అతిక్రమించిన వారికి 200 జరిమానాతో పాటు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామంటూ పర్యావరణ శాఖ ఉత్తర్వులిచ్చింది.

  అయితే సరిగ్గా దీపావళి రోజునే అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశాడు. అందులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటాను వెలువరుస్తూ,.. దేశంలో టాప్ టెన్ కాలుష్యకారక నగరాల్లో ఢిల్లీ అసలే లేదని తనకు తాను ఊదరగొట్టాడు. అయితే ఇక్కడే పలువురు నెటిజన్లు కేజ్రీవాల్ ను విమర్శిస్తూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ కాలుష్యరహిత నగరమైతే టపాసులపై సంపూర్ణ నిషేధం ఎందుకు విధించారని పలువురు విమర్శిస్తున్నారు. ఢిల్లీకంటే ఎక్కువ కాలుష్యం ఉందని చూపే నగరాల్లో కూడా టపాసులపై నిషేధం లేదు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం హిందూ పండుగలపై దాడిచేయడానికే అరవింద్ కేజ్రీవాల్ టపాసులపై నిషేధం విధించారని దీనికి కాలుష్యం ఏమాత్రం కారణం కాదని పలువురు దుయ్యబట్టారు.

  అయితే ఢిల్లీలో కాలుష్యం లేదనే ట్వీట్ చూసి ఢిల్లీ ప్రజలు బాణాసంచాను కాల్చినట్లున్నారు. నిషేధాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఢిల్లీలో టపాసులను పేల్చి పండుగ చేసుకున్నారు. కాకరపువ్వొత్తుల నుంచి రాకెట్ల దాకా అన్నిటినీ కాలుస్తూ సంబరాలను జరుపుకున్నారు. ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం ఉందని ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో అసలు కాలుష్యమే లేదంటూ చేసిన ట్వీట్ తో ఢిల్లీలోని హిందువులు ఈ విధంగా చేశారని పలువురు భావిస్తున్నారు. ఈ బాణాసంచా పేల్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ప్రతివీధిలోనూ బాణాసంచా పేలుతూ కనబడ్డాయి. దీన్ని పలువురు షేర్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్భంధం ఎప్పుడూ విజయం సాధించలేదని మరోసారి నిరూపితమైందని పలువురు అరవింద్ కేజ్రీవాల్ కు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్యం పేరుతో హిందూ పండుగలను అడ్డుకోవడం మాని పంజాబ్ లోని రైతులు గడ్డివామిని కాల్చకుండా అడ్డుకోవాలని కేజ్రీవాల్ ను కోరుతున్నారు. హిందువులను మతపరంగా అడ్డుకుంటే రాజకీయంగా కూడా విజయం సాధించలేరని పలువురు హెచ్చరిస్తున్నారు.

  Trending Stories

  Related Stories