More

    శ్రద్దా వాకర్ హత్య కేసులో 3000 పేజీల చార్జ్ షీట్.. సంచలన విషయాలు బహిర్గతం

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 3000 పేజీల డ్రాఫ్ట్ చార్జ్ షీట్ ను సిద్ధం చేశారు . ఈ చార్జ్ షీట్ లో 100 మంది సాక్షుల వాంగ్మూలం, ఎలక్ట్రానిక్ , ఫోరెన్సిక్ ఆధారాలను నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ నార్కోటిక్ టెస్ట్, ఫోరెన్సిక్ టెస్టు రిపోర్టులను కూడా జతచేయనున్నారు. ఈ చార్జ్ షీట్ ను ప్రస్తుతం న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న దవడ భాగాలు సహా 13 ఎముకల డీఎన్ఏ శ్రద్ధా తండ్రితో సరిపోలాయని పోలీసులు తెలిపారు.

    గతేడాది నవంబరు 12న ఢిల్లీ పోలీసులు ఆఫ్తాబ్‌ను అరెస్టు చేసిన తర్వాత శ్రద్దా వాకర్ హత్యకు సంబంధించిన భయంకరమైన వివరాలు యావత్ దేశాన్ని కదిలించాయి. శ్రద్ధా వాకర్ శవపరీక్ష నివేదికలో ఆమె మృతదేహాన్ని రంపపులాంటి వస్తువుతో 35 ముక్కలుగా నరికినట్లు తేలింది. దక్షిణ ఢిల్లీలోని అడవుల నుంచి కుళ్లిపోయిన 13 శరీర భాగాలను, ఎముకలను వెలికితీయడంతో కీలక పురోగతి వచ్చింది. ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి తమ మధ్య విభేదాలు ఉన్నాయని, వాగ్వాదం తర్వాత ఆమెను చంపేశానని ఆఫ్తాబ్ పోలీసులకు చెప్పాడు. ఢిల్లీలోని ఓ ఫ్లాట్ లో శ్రద్దా వాకర్ ను అఫ్తాబ్ పూనావాలా 2022 మే 18న అతి కిరాతకంగా హత్య చేశాడు. డెడ్ బాడీని 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచి ఢిల్లీలోని మోహ్రౌలీ ప్రాంతంలో పడేశాడు.

    Trending Stories

    Related Stories