More

    దీపావళి రోజు టపాసులు కాలుస్తారా అంటూ.. నలుగురిపై తుపాకీతో కాల్పులు జరిపాడు

    దేశ రాజధానిలో క్రాకర్స్ బ్యాన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే..! దీపావళి రోజున ఎవరూ టపాసులు కాల్చకండని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పిలుపును ఇచ్చింది. అయితే చాలా ప్రాంతాల్లో టపాసులను కాల్చారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా టపాసులు కాలుస్తున్న వారిపై కాల్పులు జరిపాడు. తన దగ్గర ఉన్న నిజమైన తుపాకీతో కాల్చాడు.

    ఢిల్లీలోని కేశవ్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటికి సమీపంలో టపాసులు పేల్చినందుకు కొందరిపై అతడు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనకు పాల్పడిన ఒక వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరవింద్ కుమార్‌గా గుర్తించారు. టపాసులు పేల్చుతున్న కొంతమందిని అతడు తుపాకీతో ఎదుర్కొన్నాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కేశవ్ పురం పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సంఘటనా స్థలం నుండి రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక అక్రమ ఆటోమేటిక్ పిస్టల్, నిందితుడి వద్ద నుండి లైవ్ కాట్రిడ్జ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వ్యక్తుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

    Trending Stories

    Related Stories