More

    ఢిల్లీ లిక్కర్ స్కాం: శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల కస్టడీ పొడిగింపు

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు కోర్టు అనుమతితో వారం రోజులుగా కస్టడీలోకి తీసుకున్నారు. నేటితో కస్టడీ ముగిసింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో వారం రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. వీరితో పాటు చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలను విచారణకు రావాలని నోటీసులు పంపినట్టుగా కోర్టుకు ఈడీ న్యాయవాదులు తెలిపారు. నాలుగు రోజుల విచారణకు మాత్రమే సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిని ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా జరిపిన సోదాల్లో సేకరించిన సమాచారంతో పాటు ఈ కేసులో అరెస్టైన వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories