దేశంతోపాటు రాష్ట్ర రాజకీయాలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ, సీబీఐ అధికారులు… తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఏపీకి చెందిన శరత్ చంద్రారెడ్డి, తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారి వినయ్ బాబులను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శరత్, వినయ్‌బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉండగా.. వినయ్‌బాబు మద్యం వ్యాపారం చేస్తున్నారు.
సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆయనను విచారించిన ఈడీ ఇవాళ అరెస్టు చేసింది.